జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి క్షిరాబిషేకం

అమలాపురం, రాజోలు నియోజకవర్గం మామిడికుడురు మండలం ఈదరాడ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పట్ల పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. భారతరత్న రాజ్యాంగం నిర్మాత డాక్టర్ అంబెడ్కర్ గా విగ్రహానికి పాలాభిషేకం చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్దిని ప్రసాదించమని వినతిపత్రం అందచేసారు. కొవ్వొత్తుల ప్రదర్శనతో ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమాలలో యెరుబండి చిన్ని, బి సుధాకర్, వై చిట్టిరాజా, గంగాధర్, సిహెచ్ బుజ్జి, జి.శివ, జి.బుజ్జి, హేమంత్ కుమార్, సత్యనారాయణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.