మంత్రి జబర్దస్త్ రోజా తీరు జనసైనుకుల ఆగ్రహానికి కారణం

  • ముఖ్యమంత్రి జగన్ బెస్ట్ ఆఫ్ లక్
  • జనసేన పార్టీ పవర్ ఏమిటో చూపిస్తాం
  • గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, క్యాబినెట్ మంత్రిగా ఉన్న రోజా స్దాయి మరచి అసభ్యంగా ప్రవర్తించి వేలు చూపడం ప్రజలంతా చూశారని, ఇలాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి విమర్శించారు. ‌జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, కార్యదర్శి సనావుల్లా, రామసముద్రం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, టౌన్ అధ్యక్షుడు శక్తి, రూరల్ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, ఐటి విభాగం జగదీశ్, రాజేష్, వీరమహిళలు రెడ్డెమ్మ, పద్మావతి, కోలా నాగవేణి, నౌషద్, కాంత్రి, కుమార్ పాల్గొన్నారు. ‌ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బెస్ట్‌ ఆఫ్ లక్ చెప్పారు. ఇప్పటి వరకు ప్రతిపక్షలను ఎలా ఆడుకున్న వాళ్ళు స్పందించలేదు.‌ జనసేన పార్టీతో పెట్టుకున్నారు, అనవసరంగా కెలికారు, జనసేన పార్టీ, జనసైనికుల పవర్ ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ‌ప్రభూత్వ పతనానికి నాంది పలుకుతామని, ఘోరంగా ఓడిస్తామని, జగన్ మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఇంటికి అటునుండి జైలుకే అంటూ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ నాయకులు జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి ‌ముందుగానే అనుమతి తీసుకున్న పోలీసులు ఆంక్షలు విధించడం విడ్డురంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ను హోటల్ నుండి రాకుండా అడ్డుకోవడం, జనవాణి కార్యక్రమం నిర్వహించ వద్దని ఆంక్షలు పెట్టడం, విశాఖ విడిచి వెళ్లాలని ఆదేశించడం, సెక్షన్ 41 నోటీసులు ఇవ్వడంపై తీవ్రం స్థాయిలో మండిపడ్డారు.‌ పవన్ కల్యాణ్ ను అరెస్టు చేయాలని చూస్తున్నారని అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‌తరువాత జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యతలు వహించాలన్నారు.‌ విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రి రోజా వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.‌ జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‌ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికుల, వీర మహిళలు పాల్గొన్నారు. ‌