దువ్వాడ శ్రీనివాస్ టు దుంబలి శ్రీనివాస్…!

  • మీడియా సమావేశంలో విరుచుకుపడ్డ శ్రీమతి కాంతిశ్రీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ దుంబలి శ్రీనివాస్ చిట్టాలు మీడియాకి చూపించారు. బుధవారం జిల్లాకి చెందిన తరుచు అధికారులతో, ప్రతిపక్ష పార్టీ సభ్యులతో, సొంత పార్టీ వాళ్ళతో దుర్భాషలాడే దుంబలి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మా అధినేతపై పిచ్చి వాగుడు మాట్లాడటం చూసాం. అటువంటి దుంబాలి శ్రీనివాస్ చరిత్ర చూద్దుర్ రండి అంటూ శ్రీమతి కాంతిశ్రీ అనేక విషయాలను వివరించారు.

  • ఏడుగు అసెంబ్లీ స్థానాలు ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ లో ఐదు మీ పార్టీ వాళ్ళు గెలిచినా అంత డబ్భు ఖర్చుపెట్టిన అప్పటి అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా నువ్వు ఓడటానికి కారణం నీకు ప్రజలలో ఏమాత్రం విశ్వాశం లేదు.
  • ఇంత వరకు ఏ ఎన్నికలలోనూ నువ్వు గెలిచిన దాఖలు లేవు. కారణం నీ నేర చరిత్ర. జిల్లాలో అత్యధిక నేర చరిత్ర గల నాయకునిగా నీకే సొంతం. పదమూడు కేసులులో నిఇందితుడివి నువ్వు.
  • ప్రజాక్షేత్రంలో జీరో గాడివి, దొడ్డి దారిలో ఎమ్మెల్సీ అయిపోయి ఈ దుంబలి శ్రీను దగుల్బాజి మాటలు ఆడుతున్నాడు. కాంగ్రెస్ గెంటేస్తే ప్రజారాజ్యం. ప్రజారాజ్యం బై ఎలక్షన్ ఫండ్ తో తెలుగుదేశం, అక్కడ కాకరాపల్లి పవర్ ప్లాంట్ డబ్బులతో వైసీపీ ఇంత కన్నా నీచ రాజకీయాలు ఈ జిల్లాలో ఎవరైనా చేసేవారు ఉన్నారు అంటే అది ఈ దుంబలి శ్రీనివాస్ కాకుండా ఇంక ఎవరు ఉండరు.
  • ఒక జడ్పీటీసీని చేరదీసి చిరంజీవి ప్రజారాజ్యంలో టికెట్ ఇస్తే అమ్ముడుపోయి పార్టీని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఈ చెత్త శ్రీనుది.
  • మెళియాపుట్టిలో ఆల్ఫా ట్యుటోరియల్స్ అని పెట్టి వందలాది మంది విద్యార్థులకు మోసం చేసి నువ్వు ఆ వూరి వాళ్ళతో తన్నులు తిన్న సంఘటన మరిచిపోయావా..?
  • దివంగత ఎంపీని చంపే ప్రయత్నంలో బాంబులు చుట్టి గొర్రిలా శ్రీను అనే వ్యక్తిని చంపి హరిపురం దగ్గరలో కనపడలేదా మీ ముగ్గురు అన్నదమ్ములు ??
  • ఒకడు అక్రమ గ్రానైట్లు కొండలు, మరొకడు డి-పట్టాలు భూములు ఇంకొకడు అక్రమ గ్రావెల్ తవ్వకాలు. ఇటీవల మావోయిస్టులు సైతం మీ అరాచకాల మీద హెచ్చరించారు అంటే ఏ సైతంలో మీ దోపిడీ ఉందో చూడండి.
  • ఆంధ్ర ఒరిస్సాలో వేలాది ప్రజలని మోసం చేసిన గోల్డెన్ ల్యాండ్ సంస్థ వారి భూములు పలాస హైవే మీద కోర్ట్ సీజ్ లో ఉంటే నువ్వు కబ్జా చేయలేదా శ్రీనివాస్??
  • తల్లి పాలు త్రాగి రొమ్ము మీద గుద్దడం మీ నైజం. గతంలో కాంగ్రెస్ లో ఉంటూ ధర్మానను వ్యతిరేకరించి గొర్రిలా హరిబాబు నాయుడుకు అమ్ముడుపోయింది నువ్వు కదా, అలానే ఇప్పుడు మీ తమ్ముడులు జగన్ కు మరియు పలాస నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న అప్పల్రాజుకు బహిరంగ పదవులు ఇవ్వలేదు అని నోరుపారేసుకుంటూ వ్యతిరేకించట్లేదా???
  • శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామంలో కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసింది నువ్వు కదా దువ్వాడ??

దుంబలి శీను మీద ఉన్న కేసులు:-

  • హత్యాయత్నానికి సంబంధించిన 4 అభియోగాలు (ఐపిసి సెక్షన్-307)
  • నేరపూరిత బెదిరింపులకు శిక్షకు సంబంధించిన 3 అభియోగాలు (ఐపిసి సెక్షన్-506)
  • పబ్లిక్ సర్వెంట్‌ను అతని విధుల నుండి నిరోధించడానికి స్వచ్ఛందంగా గాయపరచడానికి సంబంధించిన 2 అభియోగాలు (ఐపిసి సెక్షన్-332)
  • మోసం చేయడం మరియు నిజాయితీగా ఆస్తి పంపిణీని ప్రేరేపించడం వంటి 2 ఆరోపణలు (ఐపిసి సెక్షన్-420)
  • మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 2 ఛార్జీలు (ఐపిసి సెక్షన్-468)
  • ధ్వంసం చేయడం లేదా తరలించడం ద్వారా దుష్ప్రవర్తనకు సంబంధించిన ఛార్జీలు, పబ్లిక్ అథారిటీచే నిర్ణయించబడిన ల్యాండ్‌మార్క్, అగ్నిమాపక లేదా పేలుడు పదార్ధం ద్వారా వంద లేదా (వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో) పది రూపాయల నష్టం కలిగించే ఉద్దేశ్యంతో (ఐపిసి సెక్షన్ -435)
  • ఇంటిని ధ్వంసం చేయాలనే ఉద్దేశ్యంతో అగ్ని లేదా పేలుడు పదార్ధంతో అల్లరి చేయడం మొదలైన వాటికి సంబంధించిన ఆరోపణలు (ఐపిసి సెక్షన్-436)
  • ఎన్నికలకు సంబంధించి అక్రమ చెల్లింపులకు సంబంధించిన 1 ఛార్జీలు (ఐపిసి సెక్షన్-171హెచ్)
  • దోపిడీకి సంబంధించిన శిక్షకు సంబంధించిన 1 ఛార్జీలు (ఐపిసి సెక్షన్-384)
  • దొంగతనానికి శిక్షకు సంబంధించిన 1 అభియోగాలు (ఐపిసి సెక్షన్-379)
  • ప్రభుత్వ ఉద్యోగిని తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా నేర బలానికి సంబంధించిన 5 ఆరోపణలు (ఐపిసి సెక్షన్-353)
  • నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 5 అభియోగాలు (ఐపిసి సెక్షన్-120బి)
  • చట్టవిరుద్ధమైన సమావేశానికి సంబంధించిన ప్రతి సభ్యునికి సంబంధించిన 5 అభియోగాలు సాధారణ వస్తువు (ఐపిసి సెక్షన్-149) విచారణలో నేరానికి పాల్పడ్డాయి.
  • మారణాయుధాలతో అల్లర్లకు సంబంధించిన 4 అభియోగాలు (ఐపిసి సెక్షన్-148)
  • అల్లర్లకు శిక్షకు సంబంధించిన 3 అభియోగాలు (ఐపిసి సెక్షన్-147)
  • తప్పుడు నిర్బంధానికి శిక్షకు సంబంధించిన 3 ఆరోపణలు (ఐపిసి సెక్షన్-341)
  • ఉమ్మడి ఉద్దేశం కోసం అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలకు సంబంధించిన 2 ఆరోపణలు (ఐపిసి సెక్షన్-34)
  • ప్రభుత్వ ఉద్యోగి ద్వారా విధిగా ప్రకటించబడిన ఆర్డర్‌కు అవిధేయతకు సంబంధించిన 1 ఛార్జీలు (ఐపిసి సెక్షన్-188)
  • చట్టవిరుద్ధమైన అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నందుకు శిక్షకు సంబంధించిన 1 అభియోగాలు (ఐపిసి సెక్షన్-143)
  • స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్షకు సంబంధించిన 1 అభియోగాలు (ఐపిసి సెక్షన్-323)
  • నకిలీ డాక్యుమెంట్ లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్ (ఐపిసి సెక్షన్-471)ని అసలైనదిగా ఉపయోగించటానికి సంబంధించిన ఛార్జీలు
  • నేరపూరిత నేరానికి సంబంధించిన శిక్షకు సంబంధించిన అభియోగాలు (ఐపిసి సెక్షన్-447)
  • నేరపూరిత అతిక్రమణకు సంబంధించిన అభియోగాలు (ఐపిసి సెక్షన్-441)

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.