‘సెహరి’ ఫస్ట్ లుక్..!

హర్ష కనుమల్లి – సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’. విర్గో పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని దిల్ రాజు – అల్లు బాబీ – ఏషియన్ సినిమాస్ భరత్ నారంగ్ వంటి సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన ”సెహరి” టైటిల్ పోస్టర్ సినిమాపై ఆశక్తిని కలిగించింది. ఈ క్రమంలో నిన్న హీరో హర్ష బర్త్ డే సందర్భంగా ‘సెహరి’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. బాలకృష్ణ ఈ సందర్భంగా సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ కి విషెస్ అందజేశారు. ‘సెహరి’ ఫస్ట్ లుక్ లో హర్ష సెలబ్రేషన్ మూడ్ లో కనిపిస్తున్నాడు. పోస్టర్ కలర్ ఫుల్ గా అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. కాగా జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇటీవలే ‘సెహరి’ హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.