ప్రొడ్యూసర్ గా మారిన అనీల్ రావిపూడి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్.. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాడు. అనిల్ తన సమర్పణలో “గాలి సంపత్” అనే సినిమాని ప్రారంభించాడు. ‘పటాస్’ నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ తన చిత్రాలకు కో డైరెక్టర్ గా రైటర్ గా వర్క్ చేసిన తన స్నేహితుడు ఎస్. క్రిష్ణ ను ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు అనిల్. దీని కోసం ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ని స్థాపించారు. ఈ చిత్రానికి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి – హరీష్ పెద్ది సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు – లవ్ లీ సింగ్ జంటగా నటిస్తున్న “గాలి సంపత్” చిత్రంలో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సమర్పించడమే కాకుండా స్క్రీన్ ప్లే అందిస్తూ మెంటర్ గా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ నివ్వగా హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశానికి మెగా హీరో వరుణ్ తేజ్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా ‘గాలి సంపత్’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ మాట్లాడుతూ.. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ ను ప్రెజెంట్ చేయబోతున్నామని.. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుందని.. తండ్రీ కొడుకుల మద్య జరిగే బ్యూటిఫుల్ జర్నీ అందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి – సత్య రఘుబాబు – శ్రీకాంత్ అయ్యంగార్ – మిర్చి కిరణ్ – సురేంద్ర రెడ్డి – గగన్ – మిమ్స్ మధు – అనీష్ కురువిల్లా – రజిత – కరాటే కళ్యాణి – సాయి శ్రీనివాస్ – రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 18 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.