పవన్ పై విమర్శలను తీవ్రంగా ఖండించిన బాల్యం రాజేష్

అనంతపురం, పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించే వైసీపీ నాయకులకు అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్ ప్రశ్నలు సంధించారు. పవన్‌ కళ్యాణ్‌ వల్లనే రాష్ట్ర అప్పు దాదాపు ఐదు లక్షల కోట్లు అయ్యిందా ? నిత్యావసరాల ధరలు పెరిగాయ ? రోడ్లు అద్వానంగా తయారయ్యాయి ? పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ బిల్లులు పెరిగాయా ? ప్రత్యేక హోదా రాలేదు ? విభజన హామీలు నెరవేరలేదు ? పోలవరం పూర్తి కాలేదు ? రైతుల ఆత్మహత్యలు జరిగాయ్‌ ? రోజుకో ఉద్యోగ సంఘం రోడ్డు నెక్కుతుంది ? నిజమే సార్‌ ఆయన వల్ల ఇంత నష్టం ఉంటే తప్పకుండా! ఆలోచన చేయాలి ప్రజలు ఎవరు వీటిన్నిటికీ కారణమో ఆలోచన చేయాలి, తప్పకుండా చేయిస్తాం మేమున్నది దేనికీ అందుకే మీలా డబ్బులు తీసుకోం మంచికోసం మా డబ్బు వెచ్చిస్తాం. ఈ ఊక దంపుడు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? మీ లాగా పవన్ కళ్యాణ్ ప్రజాధనం లూటీ చేయలేదు, మూడు పెళ్ళిళ్ళ వల్ల ప్రజల కొచ్చిన కష్టం ఏమీలేదు. చట్ట ప్రకారం విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నారు. కోట్ల మంది ప్రజాధనం అవినీతిమయం అవుతుంది. హుందాగా ఉండండి వైసీపీ మంత్రుల, ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు బూతులు మాట్లాడటం ఫస్ట్ మీరు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ మీ పరిపాలన గురించి, పాలసీలు గురించి విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం పద్ధతి కాదు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు వ్యక్తిగత జీవితం గురించి విమర్శించే ముందు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏ శాఖలో ఏముంటాయో కూడా తెలియని మంత్రులు ఉన్నారు. విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం జరక్కుండా అనేక ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు నమోదు చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం ఎక్కడ వస్తుందో అని వైసిపి నాయకులకు భయం పట్టుకుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను వైసీపీ వాళ్లు వక్రీకరిస్తూ ఉన్నారు. నేను పాలసీలు పరంగా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక నా వ్యక్తిగత వివాహ జీవితం గురించి మాట్లాడటం పద్ధతి కాదు నాకు కుదరలేదు చట్టబద్ధంగా విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నాను, కావాలంటే మీరు చట్టబద్ధంగా విడిపోయి పెళ్లి చేసుకోండి దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులకు చెప్పు చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తే కొడతా అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు పెట్టిన దాడులు చేసిన జనసేన పార్టీ గెలుపును మీరు ఆపలేరు అని తెలియజేస్తున్నాము.