ఉప్పాడ గ్రామంలో ఉపవాస మహాసభలలో పాల్గొన్న డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ గ్రామంలో, పాస్టర్ ఓసుపల్లి నహేమియా వారి సంఘ పెద్దల ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఉప్పాడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఉపవాస మహాసభలలో పాల్గొనడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మీ సంఘంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం కలిగినా నేనున్నానని మర్చిపోవద్దు మీ పాస్టర్ కి కానీ లేదా మన జనసైనికులకుగాని మీ సమస్యను చెప్పవచ్చు. వాళ్ల ద్వారా మీకు నా చేతనైనంత సాయం మీకు అందిస్తానని సభాముఖంగా డాక్టర్ శ్రీధర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వంకాకొండ బాబు పూరి జగన్నాథం, బర్రె మసేను, సోడే శ్రీను, వెంకటరమణ, నక్క ఏసు, సింహాద్రి, సోడే రవికిరణ్, పలివెల్ల నాని బాబు, కొత్తపల్లి రాజు, పెన్నుపోతుల వీరబాబు, పెండ్యాల వరప్రసాద్, రాజు, పండు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.