దౌర్జన్యాలు దోపిడీలు కట్టడి చేసి, అభివృద్ది చేసి చూపిస్తాం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు ప్రజలు ఆలోచించి రానున్న ఎన్నికలలో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని జనసేనకు అవకాశం ఇస్తే ఈ పది సంవత్సరాలలో నెల్లూరులో ప్రేరేపితమైన దౌర్జన్యాలు దోపిడీలు కట్టడి చేసి, అభివృద్ది అంటే చేసి చూపించి ప్రజలకు సుపరిపాలనను అందిస్తామని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న వైసీపీ ప్రభుత్వ వైఫల్యం ప్రజల బ్రతుకు భారం కార్యక్రమం గురించి 49వ డివిజన్ కమిటీ సభ్యులతో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆదివారం ఉదయం 11 గంటలకి సంతపేట రావిచెట్టు సెంటర్ నందు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

  • పురాణాలలో దేవతలు నరకాసురుని తప్పించి వారి జీవితాల్లో దీపాలను వెలిగించినట్లు.
  • ఈ వైసిపి రాక్షస రాజ్యం నుంచి కాపాడి ప్రజల జీవితాలలో అభివృద్ధి వెలుగులు నింపేందుకు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని తెలిపారు.
  • వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీలు దౌర్జన్యాలతో ప్రజలు భయభ్రాంతులను గురి చేస్తూ ఈ మధ్యకాలంలో పేట్రేగిన హత్యలు దోపిడీలు చూస్తే తెలుస్తుంది.
  • ఒకపక్క నాయకుల అండదండలతో పౌరసరఫరాల శాఖలో కోట్ల రూపాయలు దోపిడీకి గురవుతుంటే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇవ్వాల్సిన చంటి బిడ్డల తల్లులకు పురుగులతో కూడిన ఆహారం సప్లై చేస్తున్నారు.
  • కార్పొరేషన్ లో లక్షల రూపాయలు గల్లంతై లెక్కలు తేలకుంటే ఉంటే కనీసం పేదలకు స్కానింగ్ తీసిన ఫిల్మ్ లు సైతం లేక బయటకు పంపే వారి పరిస్థితి కనబడుతోంది.
  • నాయకుల అవగాహన లోపంతో నెల్లూరు డెల్టాకు నీరు అందక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముట్టడి చేసే పరిస్థితి నెలకొంది.
  • వైసీపీ ప్రభుత్వంలో టెంపరరీ ఉద్యోగాలుగా ఇచ్చిన సచివాలయం సిబ్బందికి 12,000 నుంచి 15,000 రూపాయల జీతం ఉంటే ప్రభుత్వ పథకాలు కోత విధించిన ప్రభుత్వానికి 15 వేల రూపాయలతో ప్రభుత్వ ఒక కుటుంబ పోషణ ఎలా అనే ఆలోచన లేక లేకపోయింది.
  • ప్రజలందరూ ఈ వైసీపీ ప్రభుత్వం పైన ఆగ్రహావేశాలతో ఉన్నారు.
  • నెల్లూరులో దశాబ్దాలకుపైగా టపాకాయల నివాస ప్రాంతాలకు దూరంగా గ్రౌండ్లో నిర్వహించాల్సిఉండగా నాయకుల అండదండలతో లెక్క లేని విధంగా ఎక్కడపడితే అక్కడ లైసెన్సులు సైతం లెక్క లేకుండా పెట్టడం వారి విచ్చలవిడి తనానికి పరాకాష్ట.
  • రానున్న ఎన్నికలలో ప్రజలు అందరూ ఆలోచించి మంచి నాయకుని ఎన్నుకోవాలని జనసేనకు అవకాశం ఇస్తే ఈ పది సంవత్సరాలలో నెల్లూరులో ప్రేరేపితమైన దౌర్జన్యాలు దోపిడీలు కట్టడి చేసి,అభివృద్ది అంటే చేసి చూపించి ప్రజలకు సుపరిపాలనను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకులు కిషోర్ పాటు డివిజన్ అధ్యక్షులు హరి, అలేఖ్, రేవంత్ డివిజన్ సభ్యులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.