నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

  • ముఖ్య నాయకులకు బొటుకు రమేష్ బాబు దిశా నిర్దేశం

దర్శి, జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొటుకు రమేష్ బాబు దర్శి నియోజకవర్గములోని ముఖ్యనాయకులతో వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేసేందుకుగాను సమీక్షా సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఇటీవల పార్టీ అధ్యక్షుల వారి సూచనలు, నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల పనితీరులని దృష్టిలో పెట్టుకొని, ప్రజాసమస్యలపై మరింత దృష్టి సారించి గ్రామస్థాయినుండి ప్రజల మద్దతు సంపాందించి ముందడుగు వేద్దామని అన్నారు. స్థానికంగా పార్టీని బలహీనపరిచే పరిస్థితులని గుర్తించి, వాటిని సమయస్ఫూర్తితో, సంయమనంతో, సమర్థవంతంగా తిప్పికొడుతూ, ప్రజల మన్ననలను, అభిమానాన్ని సంపాదించాలని పిలుపునిచ్చారు. నాయకులుగా మన నడవడికను ప్రజలు గమనిస్తూనే ఉంటారని, కనుక మనం నిజాయితీ-నిబద్దతలతో వ్యవహరించి ముందడుగు వేయాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో సమస్యల పట్ల మనం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో, ఏమి చేయగలమో ప్రజలకు తెలియచేద్దామని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేటపుడు అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీల విధానాలను ప్రశ్నించేటపుడు భాష ప్రయోగంలో జాగ్రత్త వహించాలని, ఆవేశంతో కాకుండా ఎంతో సంయమనంతో హుందాతనంగా వ్యవహరించాలని, అన్నారు. నియోజవర్గంలో గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకుగాను త్వరలో కార్యాచరణను ప్రకటిద్దామని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జనసేన పార్టీ ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, తాళ్లూరు మండల కమిటీ అధ్యక్షులు కూటాల ప్రసాద్, దొనకొండ మండల కమిటీ నాయకులు గుండాల నాగేంద్ర ప్రసాద్, దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, దర్శి మండల కమిటీ నాయకులు పుప్పాల పాపారావు, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు మరియు గంగవరం గ్రామ వార్డ్ సభ్యులు పసుపులేటి చిరంజీవిలతో బాటు, కురిచేడు మండల జడ్పీటీసీగా పోటీచేసిన మరియు మండల కమిటీ ఉపాధ్యక్షులు వేమా శ్రీను మరియు మంచాల నరసింహారావు, దర్శి పట్టణ వార్డ్ నాయకులు షేక్ వెంకటేష్, వివిధ మండలాలలోని ముఖ్య నాయకులు ఉప్పు ఆంజనేయులు, కత్తి నాగయ్య, ఉల్లి వెంకట్ తదితరులు పాల్గొని నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. అనంతరం రమేష్ బాబు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవిని నాయకులందరితో సంప్రదించి కార్యాచరణను రూపిందించవలసిందిగా కోరారు.