టీం సైనిక జూమ్ సమావేశం

టీం సైనిక జె.ఎస్.పి ఇండో ఎన్నారై ఆర్గనైజేషన్ ఫౌండర్ అమీర్ ఖాన్ (సౌదీ అరేబియా) నేతృత్వంలో, పాపోలు అప్పారావు (దుబాయ్ పారిశ్రామిక వేత్త, యూఏఈ టీం లీడర్) అధ్యక్షతన జరిగిన జూమ్ సెషన్ లో తెలంగాణ వీర మహిళా విభాగం వైస్ చైర్ పర్సన్ శ్రీమతి రత్నా పిల్లా, పార్టీ అఫైర్స్ సెంట్రల్ కమిటీ వైస్ చైర్మన్, నా సేన కోసం నా వంతు కమిటీ కో కన్వినర్ శ్రీమతి కోట రుక్మిణీ (లండన్), జనసేన నాయకులు నల్లం శ్రీనివాసు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో అమెరికా నుండి సాయికృష్ణ తేజ తమ స్కాలర్షిప్ పై, తుందుర్రూ గ్రామ ఎంపీటీసీ అరేటి వాసు మెగా ఆక్వా పార్క్ ఉద్యమంలో 150 మందికి పైగా పెట్టిన కేసులు, నెల్లూరు జిల్లా రూరల్ కార్యదర్శి షేక్ షానవాజ్ కార్పొరేటర్ గా నామినేషన్ వేసిన సమయంలో జరిగిన అవకతవకలు గురించి, గుంటూరు జిల్లాలో ఉన్న రాజకీయ సమస్యలపై దార్ల మహేష్, సత్తెనపల్లి 18వ వార్డు అభ్యర్థి చింతల అరుణ కుమారి వైఫ్ ఆఫ్ వెంకట్ తమ అనుభవాలను, కులాలను కలుపుకు పోయే విధానంపై దళిత సత్తా నాయకుడు రేగిడి లక్ష్మణ్, విజయవాడ నుండి వీర మహిళా నాయకురాలు శ్రీమతి నందినీ చౌదరి గ్రౌండ్ లెవల్లో కార్యకర్తలకు దిశా నిర్దేశంపై, బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ కోసం ఒంగోలు నుండి పరుచూరి అవినాష్, కూటల లక్ష్మణ్ అనంతపురం నుండి పార్టీ శ్రేణులు ఎదుర్కుంటున్న సమస్యలపై, మరియు మిగతా జనసేన నాయకులు, సైనికులు, వీర మహిళలు తమ అనుభవాలను, సమస్యలను ముఖ్య అతిధులతో పంచుకోవటం జరిగింది. జరిగిన చర్చపై గెస్ట్లుగా వచ్చిన లీడర్లు తగు సూచనలు, సలహాలను ఇస్తూ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీర మహిళా నాయకురాళ్లు అయిన శ్రీమతి వసంతాల ప్రభావతి, శ్రీమతి షేక్ ముంతాజ్, శ్రీమతి మొలబంటి లక్ష్మీ, శ్రీమతి కాజా సుజాత, కొల్లు నరేష్, పి.కళ్యాణి (యు.ఎస్.ఏ), షాహెద్ (సౌదీ అరేబియా), విజయ్ గౌడ్ (కువైట్), పవన్ కుమార్ (కర్నూల్ జిల్లా) ఎస్.సుధాకర్ (తూర్పు గోదావరి), నాగ మల్లేశ్వరరావు (గుంటూరు జిల్లా), అచ్యుత నాయుడు, శ్రీమతి సౌజన్య (పశ్చిమ గోదావరి), శ్రీమతి ఉమా మహేశ్వరి (కృష్ణా జిల్లా), వీరభద్ర గ్రూప్, వికె సోషల్ మీడియా, జె.ఎస్.పి మంగళగిరి టీం, నిట్ల ఉమా మహేశ్వరి ( విజయవాడ దుర్గ గుడి ధార్మిక మండలి సభ్యులు), టీం సైనిక గ్రూప్ మరియు తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.