స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ సబ్ స్టేషన్ల వలన ఉపాధి అవకాశాలు తగ్గుతాయి

పాలకొండ, గిరిసేన జనసేన జనసేన వద్దకు జనసేన (29వ రోజు) జనసేన జానీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన విద్యుత్ సువర్ణ బిల్లులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ సబ్ స్టేషన్లు అమలు చేయడం వల్ల విద్యుత్ రీడింగ్ చేసేవాళ్ళు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. అలాగే సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు ఉపాధి పోతుంది. మరొకవైపు ప్రజలు స్మార్ట్ మీటర్లు కొనుగోలు చేయాలి. అదేవిధంగా సెల్ ఛార్జ్, సెల్లులు రీఛార్జ్ చేసుకున్నట్లు స్మార్ట్ మిత్రుల ద్వారా చేసుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతి ఉండదు. మత్స పుండరికం మాట్లాడుతూ… రీచార్జ్ అయిపోయిన వెంటనే చేసుకొనని యెడల విద్యుత్తు ఇంటికి సప్లై ఆగిపోతుంది. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మీటర్లు కొనుగోలు భారము, అలాగే గడువు ఉండదు. కావున ఈ విద్యుత్ సువర్ణ బిల్లును ఉపాధి కోల్పోయే ఉద్యోగ కార్మికులు ప్రజలు అందరూ రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ప్రజా సంఘాల ఐక్యవేదిక దావాల రమణారావు అందరినీ కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కర్నెనా సాయిపవన్, దూసి ప్రణీత్, సొండి సుమన్, బొమ్మాళి వినోద్, వావిలపల్లి భూషన్ పాల్గొన్నారు.