మనోజ్ దీపావళి వేడుకలు
టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ దీపావళి వేడుకలకు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హీరో రామ్ చరణ్, తన సోదరి మంచు లక్ష్మిలతో కలిసి తాను దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నదీ మనోజ్ ట్వీట్ చేశారు. మనోజ్ తన సోదరి మంచు లక్ష్మీ, రామ్ చరణ్‌తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ ఫోటోలను మనోజ్ తన ట్విటర్లో పోస్టు చేశారు. ‘స్వీట్ బ్రదర్ చరణ్, లవ్లీ అక్క లక్ష్మీలతో దీపావళి పండుగ జరపుకోవడం సంతోషఃగా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. వీటితోపాటు దీపావళి అనంతరం వచ్చే భగినీ హస్త భోజనం(భాయ్ దూజ్) వేడుకలను మంచు లక్ష్మీ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు ఇద్దరు తమ్ముళ్లతో (విష్ణు, మనోజ్) కలిసి దిగిన ఫోటోలను వీడియో రూపంలో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సోదరులకు భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలుపుతూ మంచు విష్ణు, మనోజ్‌లే తనక బలమని చెప్పుకొచ్చారు..