కరోనా ప్రబావం బాలాపూర్ గణేశుని పై 21 నుండి 6 అడుగులకు

వినాయక చవితి వచ్చిందంటే… గల్లీ గల్లీకి నాలుగైదు వినాయకులను ఏర్పాటు చేస్తుంటారు. ఎంతో ఘనంగా నిర్వహించే బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీలు సైతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకుoటుoది. తాజాగా బాలాపూర్‌ గణేశ్‌  ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి 21 అడుగుల విగ్రహానికి బదులు కేవలం ఆరడగుల విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించింది. ఈ ఏడాది లడ్డూ వేలాన్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. లడ్డూ వేలానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల పూజలు, దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. కేవలం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే గణనాథుడికి పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక గణేశ్‌ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉత్సవ సమితి స్పష్టం చేసింది.  ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఎక్కువ సంఖ్యలో వినాయకుల ఏర్పాటుకు అనుమతులు కష్టమే. అలాగే శోభాయాత్రలకు కూడా అనుమతి ఇచ్చేది అనుమానమే. కాబట్టి గతేడాదితో పోలిస్తే ఈసారి వినాయక చవితి హడావుడి కాస్త తగ్గవచ్చు.