చింతలూరు గ్రామంలో జనసేనపార్టీ కార్యవర్గ సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, చింతలూరు గ్రామంలో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన జనసేనపార్టీ కార్యవర్గ సమావేశంలో అరకు పార్లమెంటరీ జనసేన నాయకులు డా.వంపురు గంగులయ్య ముఖ్య అతిధిగా పాల్గొని ముఖ్యంగా పార్టీ శ్రేణులను ముఖ్యనాయకులను ఉత్తేజపరుస్తూ గిరిజన వాస్తవ సమస్యలను, గిరిజనపాలకులు విస్మరిస్తున్న సమస్యలను ప్రజల ముందు ప్రస్తావించి వాటి పరిస్కారం ఏమిటో మండల నాయకుల సమక్షంలో వైస్సార్సీపీ ఆగడాలను, నిరంకుశ పాలన విధానానాన్ని ఎండగట్టారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు కలవరపెడుతున్న అనేక సమస్యల్లో ఒకటైన మైనింగ్ అంశం, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 10 హైడ్రోపవర్ ప్రాజెక్ట్స్ విషయాలపై తీవ్రంగా స్పందించారు. అందులో చింతపల్లి మండలంలో ఎర్రవరం గ్రామంలో ఆదాని కార్పొరేట్ కంపనీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం యొక్క గిరిజన వ్యతిరేకతపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో మైనింగ్ కి ఉత్తర్వులు జారీ చేస్తే దానిని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి రద్దు చేసేసామని చెప్తూనే అంతర్లీనంగా కార్పొరేట్ శక్తులతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని, ఈ విషయం తెలియని అధివాసిలు విపరీత నమ్మకం పెట్టుకున్నారని, ఇప్పుడు వాస్తవ పరిస్థితులు తెలియపరిస్తే గిరిజనులకు వాస్తవాలు బోధపడుతుందని తెలిపారు. అలాగే నియోజకవర్గ పరిధిలో అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నానని ఇలా సమస్య పరిస్కారం లేని సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయని పార్టీ కోసం శ్రమించే ప్రతి జనసైనికుడు మన గిరిజనుల సమస్యలు పార్టీ దృష్టిలో తీసుకెళ్లే విధంగా సమాలోచనలు చెయ్యాలని, రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, ప్రభుత్వాలు పాలించి వివిధ సమస్యలు సృష్టించాయని కానీ పరిష్కారం దిశగా ఆలోచన చేయలేదని తెలిపారు. ఇకపై జనసేన పార్టీ విస్తృత స్థాయి గ్రామ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చేలా కార్యక్రమాలు గ్రామస్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో చింతపల్లి మండల జనసేనపార్టీ నాయకులు వాడకాని నాని, వంతల బుజ్జిబాబు, నాగేశ్వరరావు, బద్రీనాథ్, వెంకట్, పుండరీనాద్, సందేశ్, స్వామి, రవి, జి .మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, భానుప్రసాద్, పాడేరు నియోజకవర్గ ఐటి ఇన్చార్జ్ సాలేబు అశోక్, పెదబయలు కార్యవర్గ నిర్వహణ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.