‘నరసింహపురం’ మోషన్‌పోస్టర్
పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నంద కిశోర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘నరసింహపురం’. చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం ‘నరసింహపురం’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
మోషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో నందకిశోర్, హీరోయిన్ సిరి హనుమంతు, దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, వి-ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ”మోషన్ పోస్టర్ చాలా చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అలాగే ‘నరసింహపురం’ అనే టైటిల్ కూడా బాగుంది. నాకు చిరకాల మిత్రుడు, క్రికెట్ కో-ప్లేయర్ నందు (నందకిశోర్) హీరోగా పరిచయమవుతున్న ‘నరసింహపురం’ ఘన విజయం సాధించి అతనితోపాటు టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి” అని ఆకాంక్షించారు.
హీరో నందు మాట్లాడుతూ.. ”అడిగిన వెంటనే సరే అని స్వయంగా వాళ్ళింట్లో మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ గారికి మా యూనిట్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకటిన్నర సంవత్సరంగా మేమంతా పడుతున్న కష్టానికి ప్రతిఫలమే ఈ ‘నరసింహపురం’.
శ్రీరాజ్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు ఈ చిత్రాన్ని” అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ.. ”హీరోగా పరిచయమవుతున్న నందకిశోర్కి ‘నరసింహపురం’ చాలా మంచి పేరు తెస్తుంది. అతని ప్రతిభను పూర్తి స్థాయిలో వెలికి తీసే చిత్రమిది. ఈవారం క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. మా చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ చేసి, మనస్ఫూర్తిగా మెచ్చుకుని మమ్మల్ని అభినందించిన హీరో శ్రీకాంత్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం” అని అన్నారు.