సీఎం జగన్ కాపులు పట్ల కపట ప్రేమ నటిస్తున్నారు

• జనసేన పార్టీ క్రెడిబిలిటీకి చిరునామా
• నాడు కాపులు రిజర్వేషన్లు కోసం పోరాడి నేడు జగన్ పల్లకీలు మోస్తున్నారు
• నిన్న బిసిల సదస్సు నేడు కాపు నాయకుల మీటింగ్
• జే.ఎస్.పి జస్ట్ స్టార్ట్ చేస్తేనే వైసిపి నరాల్లో వణుకు పుడుతోంది. విశాఖలో ప్రజాభిమానం చూసాక, బిసిలు కాపులు గుర్తుకొచ్చేరా.
• రంగాని హత్య చేసిన నాయకుల వారసులు వైసీపీలోనే ఉన్నారు.

విజయవాడ, జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ కాపులు, బీసీల పై జగన్ రెడ్డి కపట ప్రేమ నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, కాపు పేదలకు ఎటువంటి సాయం అందించారో జగన్ రెడ్డి చెప్పాలని, ఎన్నికల సమయంలో కూడా కాపులను అవమానించే విధంగా జగన్ రెడ్డి మాట్లాడారాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేస్తూనే ఉన్నారని, ప్రతియేడాది కాపుల కోసం 2వేల కోట్లు ఇస్తానన్న జగన్ రెడ్డి కనీసం పది శాతం కూడా ఇవ్వలేదని, కాపు సామాజిక అభివృద్దికి, సంక్షేమానికి ఏం చేశారో వైసీపీలో ఉన్న కాపు పెద్దలు చెప్పాలని సవాల్ చేస్తున్నామని, కాపుల రిజర్వేషన్లకోసం పోరాటం చేసిన వారు జగన్ రెడ్డి పల్లకీలు మోసేందుకు కొంతమంది కాపు నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా కాపు సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేలా భూమణ కరుణాకరరెడ్డి బొత్స, తోట త్రిమూర్తుల ద్వారా జగన్ కుట్రలు చేసింది వాస్తవం కాదని, మూడున్నరేళ్లల్లో కాపు సామాజిక వర్గాన్ని మోసం చేస్తూనే అసత్యలు ప్రచారం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారని తెగ బాధ పడిపోతున్నారని, గోరంట్ల మాధవ్ చూపిస్తే మీకు సమ్మగా ఉందని, గుడివాడలో కొడాలి నాని క్యాసినో ఆడిస్తే మీ కళ్లు చల్లగా ఉన్నాయని, ఇటువంటి వాటి గురించి మాట్లాడకుండా… పవన్ కళ్యాణ్ పై మాట్లాడతారని, జనసేనకు ప్రజల్లో జనాదరణ పెరుగుతుండంతో జగన్ అండ్ కో వెన్నులో వణుకు పుట్టిన్దని, విశాఖలో కూడా అభిమానుల ఆదరణ చూసే.. యాత్రకు ఆంటంకం కల్పించారని, నేడు కాపు సామాజిక వర్గ నాయకులతో సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ ను తిట్టిస్తారని, వైసీపీలో ఉన్న కాపు సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఎందుకని ? నిజంగా మీకు బలం ఉంటే కులాల ప్రాతిపదిక సమావేశాలు పెట్టి కుట్రలు చేయడం ఎందుకని, జగన్ రెడ్డిని వెనుకేసుకొచ్చి మాట్లాడితే బొత్సను కాపు సామాజిక వర్గం ఉపేక్షించదని, వంగవీటి మోహన రంగాను హత్య చేసిన వ్యక్తుల వారసులు ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలని, వైసీపీలో ఉన్న వారంతా ఉత్తములా వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించింది వాస్తవం కాదఅని, మరి ఈరోజు సమావేశం పెట్టిన కాపు సామాజిక వర్గం పెద్దలంతా ఎందుకు మాట్లాడలేదని, రాధాపై రెక్కీ చేస్తే ఎందుకు ఖండించలేదని, రాధాకు సంఘీభావం ఎందుకు తెలియచేయలేదని, జగన్ పై విశ్వాసం చూపేందుకు ఈరోజు రాజమండ్రిలో సమావేశం ఉద్దేశమని, జగన్ రెడ్డి కాపులపై విషం చిమ్ముతూనే ఉన్నారని, కేంద్రం ఇచ్చిన పదిశాతం ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరని మీ జగన్ రెడ్డిని అడిగారని, తిరుపతిలో చిరంజీవి బస చేసిన హోటల్ పై వైసీపీ వారు దాడి చేయలేదని, విశాఖలో పవన్ కళ్యాణ్ పై దాడికి యత్నించింది. వైసీపీ గూండాలు కాదని, మరి వీటిపై ఈ కాపు పెద్దలంతా ఎందుకు మాట్లాడలేదని, వైసీపీలో రెడ్ల సామాజికవర్గానికి పదవులు ఇస్తున్నా ఎందుకు అడగలేదని, పవన్ కళ్యాణ్ కు విపరీతంగా పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్నారని, కాపుల మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కి విపరీతంగా పెరిగిందని, సీఎం జగన్, వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది, వెన్నులో వణుకు మొదలైందని, కాపులు, బలిజలతో పాటు, బీసీలు, ముస్లీంలు కూడా పవన్ వైపు చూస్తున్నారని ఈ సమావేశంలో చర్చ జరిగింది వాస్తవంమని, భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి అడుగులు వేస్తే మంచిదనే చెప్పారా లేదా అని? సమాధానం చెప్పాలని, జనసేన జెండా కప్పుకుంటేనే భవిష్యత్ ఉంటుందని మీరు చర్చ చేసుకున్నారని, జగన్ తీరుతో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఆయన అధికారం కోసం ఎవరినైనా బలి తీసుకుంటారని, ఇందుకు ఆయన బాబాయి వివేకానందరెడ్డి హత్యే ఉదాహరణ అని, ప్రజలంతా ఆలోచన చేయండి జగన్ కు తగిన బుద్ది చెప్పలని, పవన్ కళ్యాణ్ ను ఆపే శక్తి జగన్ కు, వైసీపీ నేతలకు లేదని ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలతో ఎపీలో మార్పు ఖాయమని అర్దమైందనీ, ఇటువంటి నియంతలకు, దోపిడీ దారులు, కుట్రదారులకు పని చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగతుందని చెప్పారనీ, పీకె మాట్లాడిన మాటలతో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందనీ, సామాజిక మార్పు, ఎపీ భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ ను గెలిపించాలనీ, అధికారం కోసం అడ్డదారులు తొక్కేవారి కోసం, మర్డర్లు చేయించే వారికి చేయూత ఇవ్వకూడదని ప్రశాంత్ కిషోర్ కు అర్దమైందనీ, జగన్ నిజ స్వరూపాన్ని ప్రజలకు వివరించేలా ప్రశాంత్ కిషోర్ కూడా ప్రచారం చేయాలనీ, అధికారం కోసం కాపు నేతలు జగన్ పల్లకీలు మోయడం ఆపాలనీ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో 46వ డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్, నగర సంయుక్త కార్యదర్శి గన్ను శంకర్, బోబ్బరి కొండలరావు, బైపుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.