జనసేన పార్టీ యర్రబాలెం గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు నియామకం

మంగళగిరి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోమవారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి మండలం, యర్రబాలెం గ్రామ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీకి ఎటువంటి మీడియా ఛానల్ గాని పేపర్లు గానీ లేవని, మనకంటూ ఉన్నది సోషల్ మీడియానే దానిని ఉపయోగించుకొని రానున్న రోజుల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ బలోపేతం అవటం కోసం మీ వంతు కృషి చేయాలని, నూతనంగా నియమితులైన కోఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. యర్రబాలెం గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు: రాపాక సుమంత్, మిరియాల సృజన్, భీమవరపు వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, మంగళగిరి మండల కార్యదర్శి నిలాంబరం, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు కాపురౌతూ సుందరయ్య, యర్రబాలెం గ్రామ ఉపాధ్యక్షులు బొక్కిశం పూర్ణచంద్రరావు, యర్రబాలెం గ్రామ కమిటీ సభ్యులు చేబ్రోలు పరుశురాం, మంగళగిరి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, తదితరులు పాల్గొన్నారు.