అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

డా. బి ఆర్. ఏ. కోనసీమ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని అవతరణ దినోత్సవ కార్యక్రమం అమలాపురం పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్టం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన కౌన్సిలర్లు గండి దేవి హారిక (7వార్డ్ ), గొలకోటి విజయలక్ష్మి (9వార్డ్ )పురపాలక కమిషనర్ వి ఐ పి ఐ నాయుడు, డి ఇ కె. అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.