అవనిగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం: మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కాపులు మా పార్టీయేనంటు కులం మధ్య చిచ్చు పెట్టడం వైసిపికే చెల్లిందని జనసేన నేతలు ఎద్దేవా చేశారు.

రాజమహేంద్రవరంలో సోమవారం వైసీపీ కాపు నేతలు నిర్వహించిన సమావేశాన్ని అవనిగడ్డ జనసేన నాయకులు తప్పు పట్టారు.

అవనిగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ నిరంతరం వంగవీటి మోహన రంగా హత్యను ప్రస్తావించే వైసిపి నాయకులు తొలుత రంగా హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కుటుంబాన్ని వైసిపి నుండి బహిష్కరించాలని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్యకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అని ప్రస్తావించిన బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆయనకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. రానున్నది జనసేన పార్టీ యేఅని మచ్చలేని నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణేనని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణా, అవనిగడ్డ మండల ఉపాధ్యక్షులు తుంగల నరేష్, అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శి కోసూరి అవినాష్, ప్రధాన కార్యదర్శి గౌస్ కాటమ, అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, యంపిటీసి బొప్పన భాను, బండ్రెడ్డి మల్లికార్జున్, పంచాయతీ వార్డు సభ్యులు కమ్మిలి సాయి భార్గవ్, భాదర్ల లోకాక్షుడు, అరజా కిరణ్ కాంత్, పంచాయతీ వార్డు సభ్యులు మత్తి శ్రీనివాసరావు, అప్పికట్ల భాస్కర్, రోహిత్ రేపల్లే, శ్రీహరి, అశ్వారావుపాలెం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ యక్కటి నాగరాజు, బచ్చు మురళి, అవనిగడ్డ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ సూదాని నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.