ఘనంగా తమ్మిరెడ్డి శివశంకర్ పుట్టినరోజు వేడుకలు

విజయనగరం, ప్రముఖ అంబేద్కర్ వాది, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ కమిర్షియల్ టాక్స్ జాయింట్ కమీషనర్, తమ్మిరెడ్డి శివశంకర్ రావు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం కనపాక, సాయిబాబా కాలనీలో నవజీవన్ వృద్ధాశ్రమంలో వేడుకలు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ ను కట్ చేసి వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో ఉన్న వృద్దులకు, అనాధ పిల్లలకు అల్పాహారాన్ని అందించి, పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ కాన్షీరాం, అంబేద్కర్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని, ప్రస్తుత కాలంలో అంతటి సిద్ధాంతాలతోను, ఆశయాలతోను రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆశయాలకోసం తన ప్రభుత్వ పదవికి త్యాగం చేసిన ధన్యజీవి తమ్మిరెడ్డి శివశంకర్ అని తన సేవలను గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన యువనాయకులు కందివలస సురేష్, నలమహారాజు, రాంకీ, శ్రీను పాల్గొన్నారు.