సూర్య పుట్టిన రోజు కానుకగా ‘కాటుక కనులే మెరిసిపోయే’

టాలీవుడ్‌లో మంచి  క్రేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సూర్య పుట్టిన రోజు(జూలై 23) కానుకగా ‘కాటుక కనులే’ అంటూ సాగే మరో రొమాంటిక్‌ సాంగ్‌ వీడియో ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం.‘‘కాటుక కనులే మెరిసిపోయే.. పాట లో సూర్య, అపర్ణ తమ సహజ నటన, నాచురల్‌ లుక్స్‌తో కట్టిపడేశారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.