జనసైనికునికి అండగా గుంతకల్ జనసేన

  • భారీ వర్షానికి నేల కూలిన జనసైనికుడు లారెన్స్ ఇంటిని పరిశీలించి అండగా ఆర్థిక సహాయం
  • అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్ పట్టణం, స్థానిక శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్న జనసైనికుడు లారెన్స్ కొట్టం భారీ వర్షం కారణంగా కూలిపోయింది. విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ వెళ్లి పరామర్శించి అండగా 5000 ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికుల దగ్గర సంఘటన ఎలా జరిగిందని ఆరా తీయగా కాలనీ వాసులు ఎన్నో ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మాత్రం మారడం లేదని, కేవలం మమ్మల్ని ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకునేటప్పుడు మాత్రమే మా దగ్గరికి వస్తారు ఆ తర్వాత మా సమస్యలను ఎవరూ పట్టించుకోరని, ఎప్పుడో 1982లో నిర్మించుకున్న మట్టి ఇళ్లలోనే మేము ఇప్పటికీ నివాసముంటున్నామని, ఏ ప్రభుత్వంలోనూ మాకు పక్కా ఇళ్ళు మంజూరు కాలేదని, రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకుంటే ప్రమాదాన్ని ఊహించుకోవడానికి భయమేస్తుందని వాపోయారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మమ్మల్ని మనుషులుగా గుర్తించి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. స్థానికులతో వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ఈ ఘటనపై సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి సాయం అందేలా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుందని భవిష్యత్తులో కూడా శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్న 35 కుటుంబాలకు పక్కా ఇళ్ళు నిర్మించే వరకు జనసేన పార్టీ అండగా ఉంటూ న్యాయ పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, ఆటో రామకృష్ణ, మంజునాథ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.