‘సామ్ జామ్’ షో లో.. మెగాస్టార్.. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’

అతి తక్కువ సమయంలోనే విశేష ప్రజాదరణ పొందిన ‘ఆహా’ ఓటీటీ వేదిక వినూత్నమైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే ‘సామ్ జామ్’ పేరిట సమంత హోస్ట్ గా ఓ టాక్ షోను ప్రారభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేయనుంది. ఇటీవల విజయ్‌ దేవరకొండతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో త్వరలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నారు.

తాజాగా, ‘సామ్ జామ్’ షోలో చిత్రీకరణ నిమిత్తం మెగాస్టార్ సెట్‌లో అడుగుపెట్టారు.  చిరంజీవి అన్నపూర్ణ స్టూడియోకు రాగా కెమెరాలు క్లిక్ మన్నాయి. సరికొత్త లుక్ తో చిరంజీవి ఆకర్షణీయంగా కనిపిస్తుండడం ఫొటోల్లో చూడొచ్చు. బ్లేజర్, డెనిమ్ ప్యాంట్స్ లో స్లిమ్ గా ఉన్న చిరంజీవి సామ్ జామ్ వేదికపై తళుక్కుమన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చిరు కూల్‌ లుక్‌ చూసి నెటిజన్లు.. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ కామెంట్లు పెడ్తున్నారు.