పవన్ కళ్యాణ్ కి జడ్ క్యాటగిరి భద్రత కేటాయించాలి
సింగనమల, 11 రోజులుగా పవన్ కళ్యాణ్ ఇల్లు పార్టీ కార్యాలయం చుట్టూ కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ బయటకు వెళుతున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని వెంబడిస్తూ పవన్ కళ్యాణ్ గారిని నిశితంగా పరిశీలిస్తున్నారు మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్దకు వచ్చి గొడవ కూడా చేశారు సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడుతూ గొడవ చేశారు సిబ్బందిని కవ్వించే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అయినా సంయమనం పాటించి సిబ్బంది ఈ ఘటన వీడియో తీసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా విశాఖపట్నం పట్టణ పర్యటన తర్వాతే జరుగుతుండడం గమనార్హం మాలో అనుమానాన్ని బలపరుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని పవన్ కళ్యాణ్ కి కేంద్ర బలగాలతో కూడిన భద్రత ఏర్పాటు చేయాలని కోరుతున్నాం పవన్ కళ్యాణ్ కి ఏదైనా జరిగితే రాష్ట్రంలోని ప్రతి జన సైనికుడు మానవ బాంబు కావడానికి కచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీ అధినేత కు ఏ రకమైన హాని తల పెట్టాలని చూసినా రాష్ట్రం అల్లకల్లోలమవుతుంది అని ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి హెచ్చరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-04-at-12.46.29.jpeg)