పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాలని నిరసన దీక్ష

🔸 బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇవ్వాలని ఆదాడ డిమాండ్
🔸 జనసైనికులను దాటి, పవన్ కళ్యాణ్ ను తాకాలని బాలు హెచ్చరిక
🔸 నిరసన దీక్షకు వీర మహిళలు, జనసేన నాయకుల మద్దతు

విజయనగరం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటివద్ద అనుమానస్పద వ్యక్తులు, వాహనాలు ఉండటాన్ని నిరసిస్తూ.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన భద్రతను కల్పించాలని కోరుతూ విజయనగరం కలక్ట్రేట్ కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన యువనాయకులు లోపింటి కళ్యాణ్, పొట్నురు చందు, కందివలస సురేష్, కనిసెట్టి రామకృష్ణ, రోయ్య రాజు, ఎంటి రాజేష్,పవన్, బత్తుల చందు, జీవ,పార్టీ సీనియర్ నాయకులు లాలిశెట్టి రవితేజ శాంతియతంగా నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ప్రజల్లో జనసేన, పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూడలేకే జగన్మోహన్ రెడ్డి ప్రభత్వం ఇటువంటి నీచమైన, దిగజారుడు రాజకీయాలకు తెరలేపిందని, కుక్కను సింహాసంపై కూర్చుండపెట్టినట్లు, భయంకరమైన క్రిమినల్ కు అధికారం కట్టబెడితే జగన్ రెడ్డి బుద్ది చూపిస్తున్నాడని, ఇటువంటి నేరపూరిత వ్యక్తులకు శిక్షలు అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేయటం వలన నేరాలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. నవసమాజాన్ని స్థాపించడం కోసం పవన్ కళ్యాణ్ వచ్చారని, అటువంటి నాయకుడిపై కుట్రపూరిత రాజకీయాలు చేస్తే రాష్ట్ర అల్లకల్లోలం అవుతుందని హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. మరోనాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ రాష్ట్రంలో అయితే రెడ్లరాజ్యం లేదా కమ్మరాజ్యం ఉండాలనే ఉద్దేశంతో బిసి నాయకులను అణగదొక్కాలని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, నవతరాన్ని సృష్టించడానికి వచ్చిన మహనీయుడు పవన్ కళ్యాణ్ ను తాకాలంటే నిజాయితీగా పవన్ కళ్యాణ్ ఆశాయాలకోసం ఉండే మా జనసైనుకులను దాటి వెళ్లాలని హెచ్చరించారు.

  • దీక్షకు మద్దతుగా వీరమహిళలు, జనసేన నాయకులు

ఈ నిరసన దీక్షా శిబిరానికి మద్దతుగా ఉత్తరాంధ్ర వీర మహిళ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, గంట్లాన పుష్పకుమారి, రాష్ట్ర గిరిజన నాయకులు, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర, పార్టీ నాయకులు రౌతు సతీష్ కుమార్, గజతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్, చీపురుపల్లి నియోజకవర్గ నాయకులు జమ్ము ఆదినారాయణ, సీనియర్ నాయకులు, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, మిడతాన రవికుమార్, ఎర్నాగుల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.