డిప్యూటీ సీఎం మరియు ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ దత్తత తీసుకున్న గ్రామంలో జనసేన పల్లెపోరు

  • పడమర విప్పర్రు గ్రామంలో రెండవ రోజు జనసేన పల్లెపోరు

తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం, పడమర విప్పర్రు గ్రామంలో శుక్రవారం జరిగిన జనసేన పల్లెపోరులో భాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన మన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఎలక్షన్లో నెగ్గిన తర్వాత శాశ్వతంగా ఎలా సంపాదించాలో దృష్టి పెట్టి దత్తత తీసుకున్న విప్పరు గ్రామాన్ని పక్కన పెట్టేసారన్నారు. గ్రామంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కొట్టు సత్యనారాయణ తెలుసుకోవాలని అన్నారు. వైసిపి ప్రభుత్వం గురించి చెప్పాలంటే రైతులకు నోట్లో మట్టి కొట్టిందన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేక డీజిల్, పెట్రోల్ మరియు నిత్యవసరాల సరుకులు రేట్లు పెరిగిపోయి ఇటు రైతులను మరియు సామాన్యులను ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. అంతేకాకుండా శ్రీనివాస్ మాట్లాడుతూ విప్పరు గ్రామ ప్రజలకు వైసిపి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎటూ పోవని ధైర్యం చెప్పి వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకొని జనసేన పవన్ కళ్యాణ్ ని మరియు నన్ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబీ, స్థానిక నాయకులు చెన్నా రాంబాబు, పసల మహేష్, పెద్ద హరిజనపేట యూత్ లీడర్ మహేష్, ఇంజేటి నాని, కందులపాటి బాలకృష్ణ, నైనాల గురూజీ, పసుపులేటి అమ్మిరాజు, బావిశెట్టి వీర రాఘవులు, మాణిక్ రెడ్డి సత్తిరాజు, లంకపిల్లి నాగరాజు, మానే తేజ, బుద్దాల సత్యనారాయణ, గొక దానయ్య, బాసంశెట్టి వెంకటకృష్ణ, తోట ప్రసాద్, బాయిశట్టి బాబీ, చినిమిల్లి బాబి, బాసంశెట్టి సుబ్బారావు తదితరులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.