జగన్ రెడ్డిది ఉన్మాధి ప్రభుత్వం

  • ఇప్పటం గ్రామస్థులకు సంఘీభావం తెలిపిన గాజువాక జనసేన
  • ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు
  • కోన తాతారావు.

గాజువాక, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతకు సంబంధించి జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగు నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, అలా చేయకుండా వైసిపి ప్రభుత్వమే పవణ్ కళ్యాణ్ ని అంతమొందించేందుకు ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని కోన తాతారావు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ బంజారా హిల్స్, హైదరాబాద్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన సాక్షాత్తు ఏపి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పేరుపై ఉండడం జగన్ రెడ్డి ప్రభుత్వంపై మరింత అనుమానాలకు తావిస్తుందని అందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు నివేదికలు ఇటూ ఏపీ, అటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి రప్పించుకొని పవన్ కళ్యాణ్ కి జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పింన్చేదుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం మహాత్మా గాంధి విగ్రహం వద్ద (జి.వి.ఎం.సి ప్రధాన కార్యాలయం ఎదుట) దీక్ష చేపట్టటం జరిగింది. అదే విధంగా మంగళగిరి వద్ద మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు మార్చ్ 14న స్థ్లమిచ్చినందుకు ఆయా గ్రామస్తులు ఇళ్లను కూల్చేయటం జగన్ రెడ్డి అన్నదానికి అద్దం పడుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ అన్నారు. ఆ గ్రామస్తులకు సంఘీభావంగా ఈ దీక్ష చేపట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, నియోజకవర్గాల ఇంచార్జిలు పి.వి.ఎస్.ఎన్ రాజు, పసుపులేటి ఉషాకిరణ్, సందీప్ పంచకర్ల, కార్పొరేటర్లు మూర్తి యాదవ, వసంత లక్ష్మి, దల్లి గోవిందరెడ్డి, నాయుకులు బోడపాటి శివదత్, గడసాల అప్పారావు, డా.బొడ్డేపల్లి రఘు, శివప్రసాద్ రెడ్డి, వన్నెంరెడ్డి సతీష్, కోన చినఅప్పారావు, త్రివేణి, కిరణ్ ప్రసాద్, సోమశేఖర్, తెలుగు లక్ష్మి, ముమ్మన మురళి, కాదా శ్రీను, యజ్ఞశ్రీ, పట్నాయక్, ముసలయ్య, జ్యోతి రెడ్డి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.