పవన్ సేన సేవా సమితి ఆధ్వర్యంలో భోరోసా కార్యక్రమం

రాజాం, పవన్ సేన సేవా సమితి రాజాం నియోజకవర్గ ఆధ్వర్యంలో ఆదివారం భరోసా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు న జరిగిన బైక్ ర్యాలీలో చోటుచేసుకున్న ప్రమాదంలో కొప్పరవలస గ్రామానికి చెందిన సిరిపురం అప్పలనాయుడు, వావిలాపల్లి బాబురావుకి గాయాలుపాలు అయిన విషయం తెలిసినదే, ఆదివారం పవన్ సేన సేవా సమితి నుంచి కొంత ఆర్థిక సహాయం చేయండి జరిగింది. అనంతరం గతనెల 30వ తేదీన జనసేన పార్టీ పిఏసి సమావేశం అనంతరం పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో రాజాం నియోజకవర్గానికి చెందిన నాయకురాలు గోకవలస సాయిమణి జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలుకు ఆకర్షితులై ఈ సమాజంలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారదులుగా అయితే మాత్రమే మన రాష్ట్రం అభివృద్ధి పథంలో సంక్షేమంగా ముందుకు వెళుతుందని, బడుగు బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటుందని, ఇటువంటి ఆలోచనలతో జనసేన పార్టీలో చేరడం జరిగిందిని తెలిపారు. ఆదివారం మర్యాదపూర్వకంగా గోకవలస నాగమణి రాజాం పార్టీ ఆఫీసులో రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజుని కలవడం జరిగింది. ఎన్ని రాజు జనసేన పార్టీ కండువా వేసి స్వాగతం పలికి చిరు సన్మానం చేశారు. తదుపరి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని, ప్రజల్లోనికి పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన విధంగా కార్యచరణ రూపొందించారు. సాయిమణి మాట్లాడుతూ జనసేన పార్టీ బోలోపేతం కోసం తన వంతు పూర్తిసహాయ సహకారాలు అందిస్తానని, పార్టీ బలోపేతానికి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. పవన్ సేన సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామాలలో జనసేన బలంగా ఉండటానికి వారి వన్తు కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఆ గ్రామాలలో ముందుకు వెళ్ళటానికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ సేన సేవా సమితి సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.