బీబీ3 కోసం ప్రగ్యా

బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్‌ కాంబో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇవాళ ప్రారంభంకానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో సాయేషా, పూర్ణలు నటిస్తుండగా..  బీబీ3 లో తాజాగా  ప్రగ్యా జైశ్వాల్ కూడా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇవాళ నుంచి ప్రగ్యా జైశ్వాల్ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈషూటింగ్‌లో హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి పాల్గొననున్నారు బాలయ్య.

ముందుగా ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి, మలయాళీ భామ ప్రయాగ మార్టిన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బాలయ్యతో కంచె భామ ప్రగ్యా జైస్వాల్ పేరును ఫైనల్ చేశారు నిర్మాతలు.రామోజీ ఫిలిం సిటీలో జరిగే షూటింగ్‌లో బాలయ్య-ప్రగ్యాపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. బోయపాటి-బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.