అయ్యప్పమాల వేసుకొని స్కూల్ కి రావద్దని విద్యార్థిని ఇంటికి పంపిన ప్రధానోపాద్యురాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పుసుగూడెం గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బెనర్జీ అనే కుర్రవాడు అయ్యప్ప స్వామి మాల వేసుకుని వచ్చాడని ప్రధానోపాధ్యాయురాలు ఇంటికి పంపించడం జరిగింది అని ములకలపల్లి జనసేన పార్టీ నాయకుల దృష్టికి రావడం జరిగింది వెంటనే ఈ విషయంపై స్పందించి ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం ద్వారా ములకలపల్లి మండలంలో ఉన్న యువజన విభాగం మరియు మండల అధ్యక్షులను జనసేన కార్యకర్తలను తీసుకొని వెళ్లి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను వివరణ కోరటం జరిగింది. స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్ కి రావాలని ఇంటికి పంపించారని విద్యార్థుడు కంటతడి పెట్టుకుంటూ ఇంటి వద్దకు వచ్చాడని తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు ప్రధానోపాధ్యాయురాలు దగ్గర మా ఫోన్ నెంబర్ ఉన్నది అని చెప్పడం జరిగింది వారు ఎటువంటి విషయం చెప్పకుండా పిల్లవాడిని బయటకు పంపించారని రోడ్డు వెంట వాహనాలు తిరుగుతూ ఉంటాయని ఏదైనా అయితే వారు బాధ్యత తీసుకుంటారని జనసేన పార్టీ నాయకులకు చెప్పడం జరిగింది. ఇదే విషయంపై జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరఫున ప్రధానోపాధ్యాయురాలు వివరణ కోరగా గత రెండు రోజులుగా వారి తల్లిదండ్రులను తీసుకొని రమ్మని చెప్పానని విద్యార్థి వినకపోవడంతో మరోసారి విద్యార్థిని మీ తల్లిదండ్రులను ఇప్పుడు వెళ్లి తీసుకొని రమ్మని చెప్పాను అని వారు చెప్పడం జరిగింది. విద్యార్థి వివరణ కోరగా స్కూల్ టైంలో మాల వేసుకోకూడదని స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక వేసుకోమని చెప్పారని విద్యార్థి చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న న్న విద్యార్థి విభాగం మరియు యువజన మరియు మండల అధ్యక్షులు ప్రధానోపాధ్యాయురాలుని విద్యార్థి మాల వేసుకుని రావడం తప్ప అని ప్రశ్నించడం జరిగింది పాఠశాలలో అన్ని కులాలను అన్ని మతాలను సమభావంతో చూడాలని మీరు ఒక ప్రధాన ఉపాధ్యాయురాలు అయి ఉండి ఇటువంటి విధానాన్ని చెప్పడం కరెక్ట్ కాదని ఖండించడం జరిగింది ఈ విషయంపై స్పందించి ఎం.ఏ.ఓ తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్య నిర్వహక సభ్యులు గొల్ల వీరభద్రం, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సెక్రెటరీ గరికే రాంబాబు, ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్, కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, కార్యకర్తలు బోలగాని పవన్ కళ్యాణ్, వాంకుడోత్ కృష్ణబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.