జనసేన వినతికి అధికారుల స్పందన

కొండేపి, పొన్నలూరు మండలంలో ముండ్లమూరివారిపాలెం గ్రామంలో రామన్నపాలెం వైపు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్న సమయంలో జనసేన పార్టీ నాయకులు “కనపర్తి మనోజ్ కుమార్” వెంటనే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని ఆ రహదారి గురించి అధికారుల దృష్టికి తీసుకునివెళ్లి వారికి తెలియజేయడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి ఆ రహదారికి ఇరువైపుల ఉన్న చెట్లను తొలగించి, రహదారిలో మట్టిని వేసి, గుంతలను పూడ్చి రహదారిని వెడల్పు చేయడం జరిగింది. శుక్రవారం ముండ్లమూరివారిపాలెం గ్రామ ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులకు స్పందించిన అధికారులకు జనసేన పార్టీ నుండి మరియు ముండ్లమూరివారిపాలెం గ్రామ ప్రజలందరి తరపునుండి అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు.