ప్రజా సమస్యల మీద పోరాడటంలో జనసేన ముందుటుంది: ముత్తా శశిధర్

కాకినాడ సిటిలో జనసేన పార్టీ కార్యాలయమునందు జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈ నెల 12,13,14 తేదీలలో వై.ఎస్.ఆర్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఐనటువంటి పేదలందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పి నేడు జగనన్న కోలనీలపైన వాటిలో ఉన్న సమస్యలపట్ల పోరాటం సాగిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రజా సమస్యల మీద పోరాడటంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అధికార పార్టీ ఎన్నికలవేళ హామీ గుప్పించి అధికారంలోకి వచ్చాకా మూడున్నర ఏళ్ళు గడిపి నేటికి వాటి స్థితిగతులని ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టు తెలియచెప్పేలా చేపట్టిన కార్యక్రమం ఇది అని తెలిపారు. ఇటీవల కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనరు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాకినాడ సిటి పేద ప్రజలకు ఇళ్ళు అందించే విధంగా ఐదు లేఅవుట్లను ఏర్పాటు చేసామని దీనివల్ల 16,800 మందికి ఇళ్ళ పట్టాలు అందచేస్తున్నామనగా, కానీ ఇప్పటికీ అసలు ఏమీ అందుబాటులోకి రాలేదన్న ప్రశ్నకు బదులుగా, జనవరి కి సుమారు 7500ల ఇళ్ళకి గ్రుహప్రవేశం చేస్తున్నామని చెప్పారు. ఈసందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ సహజంగా రాజకీయ నాయకులు వాగ్దానాలు చేయడం ఇప్పటివరకు చూసామని, కానీ నేడు విచిత్రంగా అధికారులు కూడా ఇలాంటి అభూతకల్పనలు చెప్పేలా రాష్ట్రంలో పరిస్థితి ఏర్పడటం విచారకరమన్నారు. మనం ఇప్పుడు నవంబరు నెలలో ఉన్నాము, జనవరి పండగలకల్లా 7500 ఇళ్ళు అందచేస్తామని అధికారులు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు. అందుకే రేపు ఆ కొమరిగిరి లేఅవుట్ ప్రదేశాలకు పరిశీలనకు అందరినీ ఆహ్వనిస్తున్నామని ఈ క్ష్యేత్రస్థాయి పరిశీలనలో ఎంతమందికి ఇళ్ళు కేటాయించారు, ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎన్ని పూర్తి అయ్యయో నిజం నిగ్గుతేలుతుందంటూ అక్కడ వున్న పరిస్థితులని చుపెట్టే ఒక వీడియో చూపించారు. అక్కడికి వెళ్ళే రోడ్డు సముద్రపు అలలకి కోతకు గురి అయ్యి రోడ్డు విరిగి ప్రమాదకరంగా ఉందని అన్ని పత్రికలలో చిత్రాలతో సహా ప్రచురించడం, ఇదే కాక పోలీసు శేఖవారు ఇక్కడ రోడ్డుమీద నిలబడద్దని ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఇలాంటి చోట ప్రజలకు ఇళ్ళు ఇచ్చారని, పోనీలే పట్టణంలో అయితే సెంటు భూమే, పల్లెల్లో అయితే సెంటున్నర భూమి అని తృప్తి పడితే సెంటు భూమితో సరిపెట్టారంటున్నారు. కాకినాడ పట్టణ అక్కా, చెల్లీ అరసెంటు భూమి కోల్పోవడం వాస్తవమా కాదో చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పి ముఖ్యమంత్రిచేతుల మీదుగా చేపట్టిన శంఖుస్థాపన, పైలాను తప్ప ఇంకేమైనా నిర్మాణాలు పూర్తి అయ్యాయా అని ప్రశ్నించారు. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించడం, మోసం చేయడం దారుణమన్నారు. కాకినాడ జగన్నాధపుర ప్రజలకు చొల్లంగిలో ఇళ్ళు ఇచ్చామని చెప్పారని, ఇప్పటికొచ్చి ఆ లేఅవుటు ఎక్కడ వుందో తెలియదని, కాగితాలు మాత్రమే వాళ్ళ చేతిలో పెట్టడం జరిగిందని ఇలాంటి మోసాలని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలుపుతూ ఇందులో పాల్గొని నిజా నిజాలను పరిశీలించమని పిలుపునిచ్చారు. ఈ విలేఖరుల సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షులు సంగిసెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ జిల్లా కార్యదర్శి అట్లసత్యనారాయన శ్రీమన్నారాయణ వరప్రసాద్ మరియు నాయకులు పాల్గొన్నారు.