జగనన్న ఇళ్లు, పేదలందరికీ కన్నీళ్లు: మీడియా సమావేశంలో వినుత కోటా

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని వారి నివాస గృహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12,13,14 తేదీల్లో జగనన్న ఇళ్లు, పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమం చేయబోతున్నామని తెలిపారు. జగనన్న ఇళ్లు అనే వీళ్ళ నవరత్నాలలో ఒక రత్నం రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాంగా మారిందని తెలిపారు. ఈ రత్నం ఈ వైసిపి ఎమ్మెల్యేలకు అందరికీ రత్నాలు, మనిమాణిక్యాలు లాగా ఉపయోగించుకున్నారన్నారు. పేద ప్రజలకు భారీగా మోసం చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అర్థం అయ్యే విధంగా అన్ని ప్రాంతాలు ఎక్కడైతే జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు ఉన్నాయో ఈ 3 రోజులు పర్యటించి అక్కడ పరిస్థితులు వీడియోలు, ఫోటోల రూపంలో #ఝగన్న్నంఒసం అనే హాష్ టాగ్ తో తెలియజేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 38 లక్షల ఇళ్లు పేదలకు అందిస్తామన్న ప్రభుత్వం మొదటి విడతలో 18 లక్షల ఇళ్లు 2022 జూన్ నెలలోపు పూర్తి చేస్తామని చెప్పి, కేవలం 1.5 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేదని తెలిపారు. కనీస జీవన ప్రమాణాలు అయిన త్రాగు నీరు, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు కల్పించడం కోసం 34 వేళ కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఒక్క కాలనీలలో కూడా నిర్మాణాలు చెయ్యలేదు అన్నారు. 12 వ తారీకున సమీపంలో జగనన్న కాలనీలు, రాజీవ్ నగర్, కాపుగున్నేరి దగ్గర ఉన్న ఇంటి స్థలాలను పరిశీలిస్తామన్నారు. 13న తిడ్కో ఇళ్లు పరిశీలిస్తామని, 14 న నియోజకవర్గంలో కొన్ని సచివాలయంలో సందర్శించి ప్రజలందరికీ ఈ ఇళ్ళ స్థలాల్లో జరిగే మోసాలను #ఝగనన్నంఒసం అనే హాష్ టాగ్ ద్వారా తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు రవి కుమార్ రెడ్డి, మణికంఠ, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.