ప్రభుత్వ మోసాలు బట్టబయలు చేయడానికి జనసేన సోషల్ ఆడిట్

  • మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా

అరకు నియోజకవర్గం, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈనెల 11, 12, 13 తేదీలలో జగనన్న ఇళ్ళు – పేదలందరికీ కన్నీళ్లు పేరుతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చి ఉన్నారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్ని మన నియోజకవర్గానికి ప్రజలు వద్దకి చూపిద్దాం కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కదలి రావాలని కలసి రావాలని కోరుతూ, రేపటికి అరకు నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని, జనసైనికులు, వీరమహిళలు అందరూ రావాలని కోరుతున్నాము.