జనసేన పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయాలి: ములకాల సాయికృష్ణ

రంపచోడవరం, సాధారణ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఇంకా ఏడాదిన్నర కాలం ఉన్నందున ఇప్పటి నుంచే జన సేన పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయాలని అందుకు జనసైనికులు కార్యోన్ముఖులుకావాలని జనసేన మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కమిటీ ఆదేశాలు మేరకు పార్టీని  పార్టీ ఆశయాలను జనంలోకితీసుకెళ్లాలనిసూచించారు. గడచిన ఆరు నెలల కాలంలో మండల వ్యాప్తంగా వరద విపత్తులు ఎదుర్కొంటు పార్టీఆధ్వర్యంలో బాధితులకు పార్టీ ఆధ్వర్యంలో పలు సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆనతి కాలంలో నే మండలంలో పార్టీని ముందుకు నడుపుతున్న జనసైనికుల కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. దేశంలో ఏరాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించి అమలు చేసిన ఘనత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కె దక్కిందని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోరి ప్రజా సేవకోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందని సాయికృష్ణ గుర్తు చేశారు. మున్ముందు ఇదే ఐక్యత ఇదే సేవా బావంతో ప్రజలు పక్షాన ఉండి ప్రజా సమస్యలను పరిస్కారం చేయాలని దిశానిర్దేశం చేశారు. పాలక ప్రభుత్వాలు మోపుతున్న పెనుబారాలు   నేడు ప్రజలకు గుది బండలా మారిందని సాయికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జనసైనికులు వలే పని చేయాలని అందుకు ఇప్పటి నుండే కార్యకర్తలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షులు కనుగుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బాగుల అంజనరావు కెచ్చేల పోషి రెడ్డి నుపా కళ్యాణ్ పెడపేట్ల పవన్ కళ్యాణ్ పరాంకుశం మణికంఠ ములకాల కృష్ణార్జునరావు కత్తాల హేమంత్ తదితరులు పాల్గొన్నారు.