మునగపాటి వెంకట మారుతీ రావుకి సత్కారం

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా మునగపాటి మారుతీ రావుని నియమిస్తూ ఇటీవల జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సత్కార కార్యక్రమంలో మారుతీ రావుకి శాలువాతో సత్కరించి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… మారుతీరావు లాంటి సీనియర్ నాయకుల అనుభవం మాకు ఎంతో అవసరం అని, దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, మంగళగిరి నియోజకవర్గంలో నిబద్ధతతో పని చేస్తారని చెప్పారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ నాయకులు షేక్ కైరుల్లా, మంగళగిరి నియోజకవర్గ నాయకులు చిట్టెం అవినాష్, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, ఉండవల్లి గ్రామ నాయకులు శెట్టి రామకృష్ణ, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు కౌపరతు సుందరయ్య, సీనియర్ నాయకులు నారాయణ, ఏడుకొండలరావు, ప్రకాష్ రావు, చంద్రశేఖర్, బేతపూడి గ్రామ నాయకులు శివన్నారాయణ, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, మంగళగిరి మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లీళ్ళ సాయి నందన్, చిల్లపల్లి యూత్ సభ్యులు మేకల చంద్రశేఖర్, జనసైనికులు శివ తదితరులు పాల్గొన్నారు.