జనసేన ఆధ్వర్యంలో పట్టా పత్రాల స్థలాల కోసం హోరెత్తిన ఆందోళనలు…

భైంసా రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసాలోని సర్వే నంబర్ 118లోని లబ్ధిదారులకు పట్టా పత్రాలకు సంబంధించిన స్థలాలను చూపించాలంటూ జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు హోరెత్తాయి. శుక్రవారం మధ్యాహ్నాం జనసేన ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు ఆధ్వర్యంలో బాధిత లబ్ధిదారులు భైంసా బస్టాండ్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. రోడ్డుపై భైఠాయించి రాస్తారోఖోకు దిగారు. వాహానాల రాకపోకలను అడ్డుకోని ట్రాఫిక్ వ్యవస్థను స్తంభింపజేశారు. దశాబ్ధ కాలం క్రితం సర్వే నంబర్ 118లో 60 మందికి పైగా లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించుకునేందుకు గాను స్థలాలను కేటాయిస్తూ పట్టా పత్రాలు అందజేసినప్పటికీ సరిహద్దులను చూపించకపోవడం ఎంత వరకు సబబు అంటూ జనసేవ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకెట మహేష్ బాబు ప్రశ్నిస్తూ ఆందోళణలు చేపట్టారు. సంబంధిత సమాచారం తెలుసుకున్న టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ పోలీసు సిబ్బందితో ఘటన స్థలికి చేరుకోని జనసేన ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ బాబును ఆందోళనకారులను అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో లబ్ది దారులు రాణి, కమల, రమేష్, ముత్యం, అజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.