మేడ గురుదత్ ప్రసాద్ ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో రాజానగరం జనసేన

జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సోషల్ ఆడిట్ కార్యక్రమం ‘జగనన్న ఇళ్ళు – పేదలందరికీ కన్నీళ్లు”. #JaganannaMosam అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు.. కోరుకొండ మండలం, కాపవరం, చుట్టుపక్కల 5 గ్రామాల పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోళ్లు విషయంలో గతంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయంటూ దుమారం లేసిన ఆవ భూముల్లో…పేదల కేటాయించిన ఇళ్ల స్థలాలను జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్య రాజసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి జనసేన శ్రేణులతో పరిశీలించి..రోడ్డుకు సమాంతరంగా 15 అడుగుల పైగా లోతు ఉన్న ఆవ భూముల్లో ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని…. ఒకవేళ కేటాయించిన భూముల్లో ఇళ్లు నిర్మిస్తే ఎప్పుడూ బురదమయంగా నీళ్లతో గోదావరి తలపిస్తుందని…. ఒకవేళ నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాల్లో బలవంతంగా ఇల్లు నిర్మించినా ప్రజలకు ఇవి నివాసయోగం కాదని తెలియజేసారు.

జగనన్న కాలనీల పేరిట రాజానగరం నియోజకవర్గంలో పేదలకు జరిగిన మోసాన్ని బాహ్య ప్రపంచానికి తెలియపరుద్దాం ప్రజాసంపదను కాపాడుదాం అని గళమెత్తారు!!