నంద్యాల జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

నంద్యాల నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం నంద్యాల నియోజకవర్గం లోని ఎస్సార్ బీసీ కాలనీ లో ఉన్నటువంటి టిడ్కో ఇళ్ళను నంద్యాల జనసేన నాయకులు చందు సుందర్ మరియు జనసైనికులు సందర్శించడం జరిగింది. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కలర్లు మార్చడం తప్ప పేదలకు అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అధికార పార్టీని జనసేన నాయకులు సుందర్ విమర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు షబ్బీర్, ఫక్రుద్దీన్, అభి సుంకన్న, ఖజా, రవి, జీవన్, శివ, పవన్, బిల్లా, అశోక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.