వాక్ విత్ జనసేన 3వరోజు కార్యక్రమం

ఏలూరు నియోజకవర్గ ప్రజల్లో జనసేన పార్టీపై పెరుగుతున్న ఆదరణ మరింత చేరువ అయ్యేలాగా ఆదివారం ఏలూరులోని జూనియర్ కళాశాలలో వాక్ విత్ జనసేన 3 వ రోజు కార్యక్రమాన్ని చేపట్టిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జి రెడ్డి అప్పలనాయుడు.. ఈ సందర్భంగా ఉదయం 5.30 ని.ల నుండి వాకర్స్ కు కరపత్రాలను అందించి జనసేన పార్టీ విధివిధానాలను వివరించి జనసేన పార్టీకి అవకాశం కల్పించాలని వారి మద్దతును తెలిపి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపర్చాలని రెడ్డి అప్పలనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో గుబ్బల నాగేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు, బుధ్ధ నాగేశ్వరరావు, వల్లూరి రమేష్, వేముల బాలు, నాని, కొనికి మహేష్, వాసా సాయి, బలరాం, వెంకట రమణ, సురేష్, హేమంత్, పండు వీర మహిళలు కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమాదుర్గ తదితరులు పాల్గొన్నారు.