వైసీపీ పాలనలో పేరుకే సంక్షేమం పాలనంతా సంక్షోభం

  • 2014 లో అధికారాన్ని ఇవ్వలేదనే ప్రజలపై జగన్ రెడ్డికి కోపం
  • ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన నేతలే ప్రజల కంట్లో నలుసులా మారారు
  • టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవటంపై నిప్పులు చెరిగిన జనసేన నేతలు

గుంటూరు: మాది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలు గత కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు కట్టించిన టిడ్కో ఇళ్లను మూడన్నరేళ్లుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా నిరుపేదల్ని వేధిస్తోందని, వైసీపీ పాలనలో పేరులోనే సంక్షేమం ఉందని తీరులో అంతా సంక్షోభమేనని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు #JaganannaMosam పేరుతో జరుగుతున్న సోషల్ ఆడిట్ రెండో రోజు కార్యక్రమంలో భాగంగా అడవితక్కెళ్లపాడులోని టిడ్కో గృహాలను జనసేన నాయకులు పరిశీలించారు.

జగమంత మోసం – జగనన్న మోసం అంటూ నినాదాలు చేశారు: ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం అంటూ పదే పదే నీతి ప్రవచనాలు వల్లెవేస్తారు కానీ వాటిని ఆయన పాటించరు అంటూ విమర్శించారు. గత ప్రభుత్వాలు కట్టించిన ఇల్లు పేదలకు ఇస్తే వైసీపీకి ఎలాంటి పేరు రాదని సీఎం చుట్టూ ఉండే ఎందుకు పనికిరాని సలహాదారులు ఓ ఉచిత సలహా ఇచ్చి ఉంటారని ఎద్దేవా చేశారు. దాదాపుగా పూర్తి అయిన ఇళ్లను మూడున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంచి వాటిని శిథిలావస్థకి తీసుకువచ్చారని , ఇప్పుడు అవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని లేనిపక్షంలో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతుందని నేరేళ్ళ సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయబాబు మాట్లాడుతూ వైసీపీ నేతలు తమ అవినీతికి నిరుపేదల జీవితాల్ని సైతం ఫణంగా పెట్టడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పేదలపై నిజమైన ప్రేమ ఉంటే జగనన్న కాలనీలను నిర్మించి ఉండేవాడన్నారు. కొత్త ఇల్లు ఎలాగూ కట్టలేదు కనీసం కట్టిన ఇళ్లను కూడా నిరుపేదలకు ఇవ్వకుండా వారిని నరకయాతనకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల కోసం నిరుపేదలు అప్పు చేసి డిపాజిట్లు కట్టారని ఇప్పుడు వాటికి వడ్డీ కట్టలేక ఇంటి అద్దెలు కూడా కట్టలేని స్థితిలో పేదల జీవితాలు త్రిశంఖుస్వర్గంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల్ని, ముస్లిం మైనారిటీలని, బీసీలను ఇంతలా దగా చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో మరొకరు లేరని విమర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి , జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ప్రధాన కార్యదర్శిలు యడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉదయ్, బండారు రవీంద్ర, త్రిపుర, హుస్సేన్, సుంకే శ్రీనివాసరావు, తోట కార్తిక్, మహంకాళి శ్రీను, సోమి ఉదయ్ , వీరమహిళలు ఆషా, కవిత, అరుణ, నాగేంద్ర సింగ్, బందెల నవీన్, పులిగడ్డ గోపి, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, గుర్రాల ఉమా, రోశయ్య, రజాక్, చేజేర్ల శివ, జీవానందం, పులిగడ్డ నాగేశ్వరరావు, పసుపులేటి నరేష్, కృష్ణ శర్మ, కోలా అంజి, వడ్డె సుబ్బారావు, కార్మిక నేత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.