క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన హాస్యనటుడు

తమిళ నటుడు తావసి తెలుగువారికి పెద్దగా తెలియకపోయినా.. తమిళనాట తన కామెడితో అక్కడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు. అయితే ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, మధురైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఇటీవలే తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలంటూ ఆయన దీనంగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో దాతలు స్పందించే లోపే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఆయన మృతికి తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఒకప్పుడు ఎంతో పుష్టిగా ఉన్న తావసి క్యాన్సర్ కారణంగా చిక్కిశల్యమైన స్థితిలో కనిపించారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఆయనను చూసి అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక మహమ్మారి క్యాన్సర్ కారణంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో.. చిక్కిపోయి బలహీనంగా మారాడు. తవసి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తావసి కుమారుడు అరుముగన్ ఓ వీడియోను విడుదల చేసి వేడుకొనగా… ఈ క్రమంలో ఆర్థికంగా ఆదుకునేందుకు తమిళ స్టార్‌ హీరోలు కోలీవుడ్ నటులు విజయ్ సేతుపతి, సూరి, శివకార్తికేయన్, సౌందరరాజా, శింబు, సూరిలతో పాటు మరికొంత మంది పరిశ్రమ పెద్దలు మేము సైతం అంటూ ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తావసి వైద్యానికి ఆర్థిక సాయం అందించారు.

అందులో భాగంగా హీరో శివకార్తికేయన్‌ తన ఫ్యాన్స్‌ అసోయేషన్‌తో రూ. 25వేల చెక్‌ను తావసి కుటుంబానికి అందించారు. తమిళ డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవనన్‌, తావసిని తన ఆసుపత్రిలో చేర్పించుకున్నాడు. అతడికి ఉచిత చికిత్స అందిస్తామని తెలిపాడు. మరోవైపు కమెడియన్‌ సూరీ రూ.20వేలు ఆర్థిక సాయం చేశారు. మక్కల్‌ సెల్వన్ విజయ్‌సేతుపతి లక్ష రూపాయలను తావసికి అందజేశాడు.

అయితే నాల్గవ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న తవసి.. ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో నిన్న మరణించారు. దీంతో అయన మృతి పట్ల పలువురు సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. తావసి నటించిన సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన వాటిలో ముఖ్యంగా ‘సువరాపాండియన్’, ‘వరుతాపాధ వాలిబార్ సంగం’, ‘రజిని మురుగన్’ సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. తావసి రజనీకాంత్ తాజా చిత్రం అన్నాత్తేలో కూడా నటించినట్లు సమాచారం.