సర్వేపల్లి జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

సర్వేపల్లి నియోజకవర్గం: జగనన్న మోసం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మనుబోలు మండలంలో జగనన్న పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అక్రమంగా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి జగనన్న లేఔట్లలో అవినీతి జరిగింది. అంతేకాకుండా అర్హులైన వారికి పూర్తిస్థాయిలో ఇల్లు అందకపోగా 70 శాతం వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు మరి మంత్రిగారి నియోజకవర్గము అండి సామాన్యులకు పూర్తిస్థాయిలో ఇళ్ల స్థలాలు అందకపోవడం ఇల్లు బేస్మెంట్లు కూడా మొదలు పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం దయచేసి ఇకనైనా పేదల కి ఇస్తానన్న సొంత ఇంటి కలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నీరు చేసినటువంటి జగనన్న లేఔట్లలో కొన్ని దగ్గర్ల కనీసం రోడ్డు వసిత కానీ, కరెంటు సౌకర్యం కల్పించని పరిస్థితులు పునాదులు కూడా మొదలుపెట్టని పరిస్థితులు మనం గమనించవచ్చు. ఈ కార్యక్రమంలో శివరాత్రి సందీప్, శ్రీహరి, వంశీ, తదితరులు పాల్గొన్నారు.