విజయనగరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా జన నీరాజనాలు

విజయనగరం అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టించిన పవన్ పర్యటన రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ కుంభకోణం జగనన్న ఇళ్లల్లో జరిగిన అక్రమాలను జనసేన అదినేత పవన్ కళ్యాణ్ #JaganannaMosam జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంతో ప్రజలందరికీ తెలుపుదామనే ఉద్దేశ్యంతో కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో జగనన్న ఇళ్లల్లో పెద్దదిగా నిర్మాణమవుతున్న విజయనగరం నియోజకవర్గం, గుంకలాం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి, సగంసగం నిర్మితమైన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. జిల్లాలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టగానే పద్నాలుగు కిలోమీటర్ల మేరా పూలతోను, గజమాలలతోను, తిలకందిద్ది, హారతులు పట్టి జననీరాజనాలు పలికారు. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటన ముందు హుటాహుటిన వెళ్లి, హడావిడి చేశారు. పవన్ కళ్యాణ్ గుంకాలం వచ్చినప్పుడు లబ్ధిదారులు రాకూడదని, అలాగే మీ డివిజన్ల నుండి జనాలు కూడా వెళ్లకూడదని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు హెచ్చరికలు జారీచేసినా పవన్ కళ్యాణ్ పట్టణంలో అడుగుపెట్టగానే వేలాదిగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పవన్ కు స్వాగతం పలికిన తీరుచూసి స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు, వైఎస్సార్సీపీ మేతనాయకులకు ఏమిచేయాలో తోచలేదు. రెండుచోట్లా ఓడిన పవన్ కళ్యాణ్ కు ఇంత ప్రజాధరణ చూసి ఓర్వలేక, ఎక్కడ వారి మోసాలు ప్రజలకు తెలిసి, గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రజలు జగనన్న ఇళ్లులు ఏవి అని నిలదీసి ఎక్కడ ఛీ కొడతారో అని భయపడుతున్నారు. విజయనగరం పట్టణమంతా జనసేనకు ఒక్క కార్పొరేటర్ లేడు, నాయకులు లేరు, కనీసం ఎమ్మెల్యే లేని పార్టీకి అధికార పార్టీకి మూడు చెరువులు తాగిస్తున్నారు, అధికారం లేకుండానే ఇంతచేస్తే జనసేనకు మనమంతా ఒక్క అవకాశం ఇస్తే మంచి సుపరిపాలన అందిస్తారనే గుసగుసలు ప్రజలనుండి వినిపించడం గమనార్హం.