కూనవరం మెట్ట గంగాలమ్మ తల్లి దగ్గర ఉన్న మెట్టను మొత్తం తినేసిన వైసీపీ పెద్దలు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కూనవరం చుట్టుపక్కల గ్రామల వారికి ఇచ్చిన జగనన్న కాలనీలను సందర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచిర్ల విజయ శంకర్. జగనన్న ఇళ్లు – పేదల కన్నీళ్లు కార్యక్రమంలో బాగంగా 2వ రోజు జగనన్న ఇళ్ళ కేటాయింపు పూర్తిగా నివాసయోగ్యం కానీ ప్రాంతాలలో జరిగింది. ప్రభుత్వం నిర్మాణాలు చేపట్ట లేదు కావున అక్కడ స్థలాలు అన్ని నిరుపయోగంగా ఉండటమే కాకుండా ఊరికి 2కిలో మీటర్ల దూరంలో ఉండడం ఎలాంటి సౌకర్యాలు లేవు వర్షాలు కురిసినప్పుడు మునిగిపోయే ప్రదేశాల్లో ఇవ్వడం వల్ల లబ్ధిదారులు ఎవరూ కూడా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు అని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, మండల కమిటీ ప్రధాన కార్యదర్శి దుబాయ్ శ్రీను, చిడిపి నాగేష్, రాజు, అప్పయమ్మ (ప్రసాద్ ), సీతానగరం మండల వీరామహిళ కందికట్ల అరుణ కుమారి,జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు నాగు, చదువు ముక్తేశ్వరరావు, గణశాల ఏసుబాబు, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, తెలగంశెట్టి శివ, రాయపాటి హరీష్, రాయపాటి సూరిబాబు, రాజానగరం మండలం నాయకులు మెడిద వీరబాబు, నందికం శేషగిరి, చిక్కాల నాగు, గేదల సత్తిబాబు, కాపు గ్రామస్తులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.