నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు

ఆత్మకూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జగనన్న మోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో… ఆత్మకూరు పట్టణ సమీపంలోని జగనన్న కాలనీలను మరియు మున్సిపాలిటీ పరిధిలోని జాలయ్య నగరం సమీపంలోని టిట్కో గృహ సముదాయాలను సందర్శించడం జరిగింది. జగనన్న కాలనీలలో 1936 ఇళ్ళకు గాను, కేవలం134 మాత్రమే పూర్తయ్యాయి. టిడ్కో గృహాలు పూర్తయి మూడు సంవత్సరముల కాలం గడిచినప్పటికీ నేటి వరకు పూర్తిగా గృహాలను లబ్ధిదారులకు కేటాయించడం జరగలేదు. మిగిలిన గృహాలను కూడా లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని మరియు తాగునీటి సౌకర్యం, వీధిలైట్లు వంటి కనీస వసతులను కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. 1936 కాలనీలకు గాను కేవలం134 మాత్రమే పూర్తయ్యాయి అంటే నిరుపేదలకు మీరు ఇస్తున్న ఇళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేసి ఇస్తారు? స్పష్టంగా లబ్ధిదారులకు చెప్పవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వంశీ, చంద్ర, నాగరాజు, తిరుమల, భాను, పవన్, అనిల్, మదన్, హజరత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.