వెల్లంపల్లికి గాలి షాహిద్ దర్గా పై అంత కక్ష ఎందుకో సమాధానం చెప్పాలి..?: పోతిన మహేష్‌

  • గాలి షాహిద్ దర్గా పై అంత కక్ష ఎందుకో ?
  • వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల కోసం, దర్గా ఆస్తులను కబ్జా చేయడం కోసం కొత్త కమిటీ అని నాటకాలు ఆడుతూ తెరమీదకి తెస్తున్నారు
  • పశ్చిమంలో ఒక్క దర్గాకైనా కమిటీ వేశారా?

విజయవాడ వెస్ట్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్‌ మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు ముస్లింలకు మంచి కాదు మోసం చేస్తున్నారని, గాలి షాహిద్ దర్గా పై అంత కక్ష ఎందుకో? సమాధానం చెప్పాలని, పేద ముజావర్లకు చెందిన భూములను వెల్లంపల్లి శ్రీనివాస్ మిత్రుల చెరలో ఉన్న మాట ముమ్మాటికీ నిజంమని, దమ్ముంటే వారి చెరలో నుంచి కబ్జా అయిన భూములను విడిపించాలని, వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల కోసంమే దర్గా ఆస్తులను కబ్జా చేయడం కోసం కొత్త కమిటీ అని నాటకాలు ఆడుతూ తెరమీదకి తెస్తున్నారని, పరస్పర అంగీకారంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ యాక్ట్ ను అనుసరించి గాలి షాహిబ్ దర్గాకు డైరెక్ట్ మేనేజ్మెంట్ కింద రెండు సంవత్సరాల కాల పరిమితితో అనుమతిని మంజూరు చేస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో సమాధానం చెప్పాలని, ఎవరికి ఏ భూమి లీజుకి ఇవ్వాలన్నా అది కేవలం వక్ఫ్ బోర్డు అనుమతితోనే ఇవ్వాల్సి ఉంటుందని, దాన్నుంచి తప్పించి కాజేసే కుట్రలో భాగంగానే వెల్లంపల్లి కుతంత్రాలు రచిస్తున్నారని, గతంలో వక్ఫ్ కు 7% ఆదాయంలో భాగంగా చెల్లించేవాళ్లు కానీ నేడు పరస్పర అంగీకారంతో 20% వక్ఫ్ బోర్డుకు 80% దర్గాకు చెందినగా అంగీకారం కుదిరిందని, ఏ లీజైన డైరెక్ట్ మేనేజ్మెంట్లో వక్ఫ్ బోర్డ్ అనుమతి లేకుండా ఇవ్వలేరని, దీనివల్ల స్థానిక ఎమ్మెల్యే కి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని, కాజా కోసం ఇంత డ్రామాని, కాజాకు వెల్లంపల్లి శ్రీనివాస్ కు మధ్య ఉన్న క్విడ్స్ ప్రోకో ఒప్పందం ఏమిటో ? చెప్పాలని, గతంలో వెల్లంపల్లి కుటుంబ సభ్యులకి కారు, వాచి కొనిచ్చారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని,వెల్లంపల్లి ఊసరవెల్లి లాంటోడని, ముసలి పులి బంగారు కడియం లాగా చూపించి మోసం చేస్తాడని, కాజా వెల్లంపల్లి వలలో పడొద్దని. పేద 400 ముజావర్ల కుటుంబాలకు చెందాల్సిన డబ్బులు కాజేసేందుకే శ్రీనివాస్ కుట్రలు పన్నుతు వివాదాల సృష్టిస్తున్నాడని, ఏ రాజకీయ పార్టీ ఏనాడు గాలి షాహిబ్ దర్గా విషయాలలో జోక్యం చేసుకోలేదని. జలీల్ ఖాన్ గతంలో బలవంతంగా దర్గా జోలికి వెళ్లినందుకు ఆయనకే ఏ గతి పట్టిందో నేడు వెల్లంపల్లి కి అదే గతి పట్టి తీరుతుందని, గాలి సాహిబ్ దర్గా కి చెందిన భూములు విజయవాడ నగరంలోని చాలామంది రాజకీయ పెద్దల చేతిలో ఉన్నాయని, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏనాడు ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడలేదని ,షాది ఖానా విషయంలో కానీ, అస్లాం హత్య కేసు విషయంలో కానీ వైఎస్ఆర్సిపి నాయకులైన చాంద్ భాషా కుమార్తె అత్యాచార విషయంలో కానీ స్పందించలేదని ముస్లింలు మైనారిటీలు అంటే వెల్లంపల్లి కి ఎప్పుడు చిన్న చూపేనని పశ్చిమ నియోజకవర్గఒ లో ముస్లింలకి చెందిన ఏ ఒక్క దర్గాకు కమిటీ నేటికీ వేయలేదని మూసాఫిర్ ఖానా, ఇందాద్ ఘర్, షా ఖాదరి హుస్సేనీ దర్గా, జిల్లా వక్ఫ్ బోర్డ్ లకు నేటికీ కమిటీలు వేయలేదని గాలిబ్ షాహీద్ద ర్గా జోలికి వస్తే ఊరుకోమని తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు, సిగ్నం శెట్టి రాము, గుప్తా పాల్గొన్నారు.