నిర్లక్ష్యంగా వ్యవరించిన ఏపీఎస్ఆర్టీసీని ప్రశ్నించిన ఎం హనుమాన్

విజయవాడ: ఆర్టీసీ చార్జీలు పెంచినా ప్రజలకు ఈ ప్రభుత్వం సురక్షితమైన ప్రయాణం కల్పించడం లేదు. జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు హనుమాన్ ప్రయాణిస్తున్న కర్నూల్ నుంచి వయా విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో నల్లమల ఘాట్ రోడ్ లో బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో పాసింజర్లు 50 మంది దాకా దాంట్లో ముసలి వాళ్లు ఆడపడుచులు సుమారు 6 గంటల సమయం నల్లమల్ల అడవుల్లో వేచి ఉన్నారు. కేవలం ఇది ఆర్టీసీ నిర్లక్ష్యం అని ఆయన తెలియజేశారు. కనీసం టూల్ కిట్టు కూడా క్యారీ చేయని ఆర్టీసీ సిబ్బంది. ప్యాసింజర్లు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళ మీద గట్టిగా మాట్లాడం జరిగింది. ఇది కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని చూసుకుని ఆర్టీసీ యాజమాన్యం సరిగ్గా పని చేయడం లేదు.. నిర్లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ సురక్షిత ప్రయాణం మాటకు అర్థం లేదు.. మంగళ వారం జరిగిన సంఘటన ప్రజలు 50 మంది దాకా 6 గంటల సమయం నల్లమల అడవుల్లో వేచి ఉన్నారు. ఇలాంటి గోరాలు ఆర్టీసీ లో మరెన్నో వెలుగు చూశాయి. ధరల పెంచినా ఆర్టీసీ చార్జీలు పెంచినా సరే నిర్లక్ష్యం.. కనీసం పాసింజర్లు సురక్షితను కాపాడుకోలెని ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏమి చేస్తుంది. ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు కానీ.. ప్రజల సురక్షితం ఎక్కడ..? ఈ విషయంలో ఆర్టీసీ విఫలమైంది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చార్జీలు పెంచడం ప్రజలందరికీ ఒక తీరని బాధాకర విషయం. కానీ ధరల పెంచినా కనీస సౌకర్యాలు కూడా ఆర్టీసీ ప్రజలకు అందచేయలేకపోతున్నారు. బ్రేక్ డౌన్ అయిన బస్సుల్లో కనీస టూల్ కిట్లు కూడా మెయింటైన్ చేయని ఆర్టీసీని.. ప్రజలు భవిష్యత్తుతో ఆడుకునే ఆర్టీసీ యాజమాన్యాన్ని జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది ఎం హనుమన్ నిలదీసారు.