జగనన్న కాలనీలపై భహిరంగ చర్చకు సిద్ధం: జి. ఏర్రి స్వామి

జగనన్న కాలనీల పై జగన్ ప్రభుత్వం పై ఏ పార్టీలకు మాట్లాడే అర్హత లేనప్పుడు కేంద్ర బిజేపి ప్రభుత్వము ఈ రాష్ట్రానికి కేటయించిన పి.ఎం.ఆర్.వై పథకం ద్వారా 20.05935 గృహాలను కేటాయించగా రాష్ట్రం లో 15,00,000 లక్షల పైగా పట్టాలిచ్చి జగనన్న కాలనీగా పెట్టుకోవడం తప్పు కాదా?. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో 1600 పట్టాలిచ్చి వాటిలో 600 రద్దుచేసి వైసిపి నాయకులు బినామీలుగా పెట్టుకొని వైసిపి ప్రభుత్వం ఇచ్చిన 1600 పట్టాలలో ఎన్ని గుణాధులు కంప్లీట్ అయినాయి ఎన్ని ఇల్లు కంప్లీట్ చేసి పేద ప్రజలకు ఇంటి తాళాలు ఇచ్చారు? చెప్పండి.. మేము బహిరంగ చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా? బుక్కరాయసముద్రం మండలంలో మిగిలిన 34 గ్రామాలలో లబ్ధిదారులకు అనువు గాని చోట ఇంటి స్థలాలు ఇచ్చి.. ఒక్క గుణాధి కూడా లేవు అని మా జనసేన నాయకుల పరిశీలనలో తెలిసింది. ప్రభుత్వ సలహాదారులు గౌరవ సాంబశివ రెడ్డి గారికి జనసేన పార్టీ తరుపున ఒకటే అడుగుతున్నాం. ఆలూరు సాంబశివారెడ్డి గారు మీరు గ్రామాల్లోకి వచ్చి పరిశీలన చేస్తే లబ్ధిదారులు మమ్మల్ని చీ కొడతారో ?.. మిమ్మల్ని చీ కొడతారో అప్పుడు అర్థం అవుతుంది. గడపగడప ప్రోగ్రాంలో కొన్ని పథకాలు గురించి మాత్రమే కాకుండా జగనన్న ఇంటి స్థలాల పట్టాలు తీసుకున్న లబ్ధిదారులను స్థలాల్లోకి తీసుకువెళ్లి అడిగితే వాల్లు నివసించడానికి అనువైనా చోట కాదా అని లబ్ది దారులను అడిగితే వారి ఆవేదన బాధలు అర్థం అవుతాయి. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంటుంది. వాటిలో బాగంగా జనసేన పార్టీ జగనన్న ఇల్లు అక్రమాలపై ప్రజల తరఫున ప్రశ్నించడం మా హక్కు. బుక్కరాయసముద్రం మండలంలో జగనన్న ఇళ్లపై అక్రమాలు జరిగాయి అనేది వాస్తవం దీనిపై బహిరంగ చర్చకైన మరోక సారి జగనన్న కాలనీల పరిశీలనకైనా సిద్ధం అని మండల కన్వీనర్ జి. ఏర్రి స్వామి నిరసన తెలిపారు.