నాచురల్ స్టార్ ‘టక్ జగదీష్’
నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న 26వ చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్మాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లోరూపొందుతోన్న చిత్రo ఇది. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకణ పూర్తి కాగా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ లాక్డౌన్ సమయంలో చిత్ర నిర్మాతలు సినిమా షూటింగ్ జరిగినంత వరకు ఎడిట్ చేయించడమే కాదు.. సంబంధిత పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేసేశారట. కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గగానే మిగిలిన షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారని సమాచారం. నాని ‘టక్ జగదీష్’ కోసం మరి కొంతకాలం ఎదురు చూడల్సిoదే.